https://oktelugu.com/

Hyundai: ఈ ఏడాది లాంఛ్ అయ్యే.. హ్యుందాయ్ బెస్ట్ కార్లు ఇవే!

ఈ ఏడాది కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో కార్లను ప్రదర్శించనున్నారు. ఇందులో హ్యుందాయ్ కంపెనీ మొత్తం 5 మోడళ్ల కార్లను లాంచ్ చేయనుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 2, 2025 / 03:15 AM IST

    Hyundai

    Follow us on

    Hyundai: న్యూ ఇయర్‌లో కొత్త వస్తువులు కొనాలని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా చాలా మంది కార్లు, మొబైల్స్ వంటివి కొనడానికి ప్లాన్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రతీ ఏడాదికి ఇంప్రూవ్‌మెంట్ ఉండాలని, లైఫ్‌‌లో ఎంజాయ్ చేయాలని కారు కొంటారు. కొందరికి అయితే కారు అనేది ఒక డ్రీమ్. డబ్బులు సేవ్ చేసి మరి కారు కొంటుంటారు. ముందుగానే అన్ని ప్లాన్ చేసుకుని కొంటారు. ఎప్పుడైతే ఆఫర్లు ఉంటాయో అప్పుడే కొనాలని, కొత్తగా వచ్చిన మోడల్స్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చినవి ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ ఏడాది కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో కార్లను ప్రదర్శించనున్నారు. ఇందులో హ్యుందాయ్ కంపెనీ మొత్తం 5 మోడళ్ల కార్లను లాంచ్ చేయనుంది. ఈ ఐదు కూడా బెస్ట్ మోడల్స్. మీకు ఇందులో నచ్చిన కారును మీరు ఈ ఏడాది కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఆ ఐదు మోడల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

    కెట్రా ఈవీ
    హ్యుందాయ్ ఫ్లాగ్ షిప్ ఆఫర్లలో ఒకటైన కెట్రా ఈవీని తీసుకురానుంది. ఇది సరికొత్త ఎలక్ట్రిక్ కారు. ఇది కొత్త స్కేట్ బోర్డ్ ప్లాట్ ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు మెరుగైన బ్యాటరీని అందిస్తుంది. ఈ ఏడాదిలో వచ్చే కార్లలో ఇది ఒక బెస్ట్ కారు అని చెప్పుకోవచ్చు. దీనికి క్యాబిన్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఈవెంట్‌లో దీని ధరను ప్రకటించే అవకాశం ఉంది.

    హ్యుందాయ్ ఐయోనిక్ 5
    హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఫేస్ లిఫ్ట్ గ్లోబల్ లాంచ్‌ గతేడాది జరిగింది. కానీ కారు ఈ ఏడాది మార్కెట్‌లోకి రానుంది. ఈ కారును కొత్త ఆఫర్లతో మొబిలిటీ ఎక్స్‌ పోలో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.

    ఐయోనిక్ 6
    హ్యుందాయ్ ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఈ ఏడాది జరిగే ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు. ఈ కారు ఆర్‌డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ వేరియంట్లలో ఉంటుంది. అయితే కస్టమర్ల వినియోగాన్ని బట్టి దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.

    ఐయోనిక్ 9
    హ్యుందాయ్ ఐయోనిక్ మోడల్‌ను తీసుకురానుంది. గతేడాది లాంచ్ చేసిన ఐయోనిక్ 9 ఈ ఏడాది మార్కెట్‌లోకి రానున్నట్లు సమాచారం.

    హ్యుందాయ్ టుసాన్
    హ్యుందాయ్ టుసాన్ అనే అప్డేటెడ్ మోడల్‌ను లాంచ్ చేయనుంది. ఇందులో రెండు పెద్ద ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లేలు ఉంటాయి. వీటితో పాటు కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్ సెన్సిటివ్ ప్యానెల్ కూడా ఉంటాయి. అయితే దీని గ్రిల్, హెడ్ లైట్లలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ కారు లుక్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది.