Blood Sugar Control: మీకు షుగర్ వ్యాధి రావద్దంటే ఈ పండ్లు, కూరగాయలు తినండి

షుగర్ ఉన్నవాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. షుగర్ ఉన్నవారికి బీపీ తోడవుతుంది కనుక ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించడం మంచిది. అలాగే సమయం ప్రకారం భోజనం చేయాలి. అన్నం తగ్గించి జొన్న, సజ్జ, గోధుమ.. ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. టీ, తగ్గించి వాడడం మంచిది. వాటికంటే లెమన్ టీ అల్లంటి తీసుకోవడం ఉత్తమం. నూనెలో బాగా వేయించిన పదార్థాలు అయినా వడియాలు, అప్పడాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వడలు, పూరీలు, బజ్జీలు, మైదాతో చేసినవి తగ్గించాలి. పూర్తిగా ఆపేయడం కూడా మంచిది.

Written By: BS, Updated On : July 17, 2023 5:37 pm

Blood Sugar Control

Follow us on

Blood Sugar Control: మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల షుగర్ వ్యాధి సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింద. 30 ఏళ్లు దాటిన వారు కూడా షుగర్ సమస్య బారిన పడుతున్నారు. షుగర్ రాక ముందు జాగ్రత్త పడకపోవడం, వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ఆహారపు అలవాట్లను పాటించకపోవడం వలన తీవ్ర ఇబ్బందులను పడుతున్న వారు ఉన్నారు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారు తీసుకునే ఆహారం, పలు విషయంలోనూ జాగ్రత్తలు పడాల్సిన పరిస్థితి. ఏమాత్రం అదుపుతప్పిన రక్తంలోని చక్కర స్థాయి అనూహ్యంగా పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది. పండ్లు తీసుకున్న ఈ ఇబ్బందులు తప్పవు. అయితే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం లేదంటున్నారు.

చిన్నప్పటి నుంచి తింటే ఆ సమస్యకు దూరం..

షుగర్ వచ్చిన తర్వాత పళ్ళు తినకూడదని చెబుతుంటారు. అయితే పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు చిన్నప్పటినుంచి బాగా తింటే షుగర్ సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు. షుగర్ సమస్య ఉన్నవాళ్లు కూడా ఒక పద్ధతిలో పిండి పదార్థాలను బాగా తగ్గించి ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపున పండ్లు తీసుకోవడం మంచిది. అయితే బాగా తీయగా ఉండే మామిడి ద్రాక్ష అలాంటివి కాకుండా దోర జామ, కివి, బొప్పాయి లాంటివి తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆకుకూరల్లో సమృద్ధిగా ఐరన్..

ఇక చిన్నప్పటి నుంచి పెద్దలు, నిపుణుల నుంచి ఎక్కువగా వినే మాట ఆకుకూరలు బాగా తినమని. నిజంగానే ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యకరంగా ఉండవచ్చు. తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పుంటి కూర, పాలకూర, మెంతికూర వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఆహారంలో ఒక ఆకుకూర ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాల్లో కూడా ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.

షుగర్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

షుగర్ ఉన్నవాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. షుగర్ ఉన్నవారికి బీపీ తోడవుతుంది కనుక ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించడం మంచిది. అలాగే సమయం ప్రకారం భోజనం చేయాలి. అన్నం తగ్గించి జొన్న, సజ్జ, గోధుమ.. ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. టీ, తగ్గించి వాడడం మంచిది. వాటికంటే లెమన్ టీ అల్లంటి తీసుకోవడం ఉత్తమం. నూనెలో బాగా వేయించిన పదార్థాలు అయినా వడియాలు, అప్పడాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వడలు, పూరీలు, బజ్జీలు, మైదాతో చేసినవి తగ్గించాలి. పూర్తిగా ఆపేయడం కూడా మంచిది.

షుగర్ ను అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి..

ఇకపోతే షుగర్ పెరగకుండా చూసుకోవడానికి అనుగుణంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తిన్నది ఏదైనా అరిగించుకునేలా ఉండాలి. అంటే క్యాలరీలు ఖర్చు అయ్యేలా చూసుకోవాలి. అలాగే నడకతో పాటు వ్యాయామం చేయడం చాలా మంచిది. ఓపిక శక్తిని బట్టి ఈత, సైక్లింగ్ చేస్తే ఉపయోగం కలుగుతుంది. రాత్రిపూట కనీసం 8 గంటల పాటు కంటి నిండా నిద్రపోవడం తప్పనిసరి. ఒత్తిడికి దూరంగా ఉండడం, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేలా జాగ్రత్త పడడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

ఈ పదార్థాలకు దూరంగా ఉండడం అవసరం..

షుగర్ ఉన్న వ్యక్తులు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. స్వీట్లు, ఐస్ క్రీమ్ లు, పదార్థాలకు దూరంగా ఉండాలి. అరటి పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండటం చాలా ఉపయోగం. అదేవిధంగా బొప్పాయి పండు లో కూడా చక్కెర స్థాయిలో ఎక్కువగానే ఉంటాయి. షుగర్ ఉన్నవాళ్లు చాలా మితంగా మాత్రమే ఈ పండు తీసుకోవాలి. పండ్లతో పోలిస్తే జ్యూసులు, ఎనర్జీ డ్రింక్స్ లో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మేలు. ప్రాసెస్డ్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.