Health Issue: చలికాలంలో మాత్రమే చేతులు, కాలు చల్లగా ఉంటాయి. ఇంట్లోనే కాకుండా బయట ఎక్కడ పాదం మోపిన కూడా కాళ్లు, చేతులు చల్లగా అనిపిస్తాయి. అయితే అందరికి ఇలా జరగదు. కేవలం కొందరికి మాత్రమే ఇలా జరుగుతుంది. కొందరు వెచ్చని దుస్తులు ధరించిన కూడా వారి చేతులు, కాళ్లు అన్ని కూడా చల్లగా అనిపిస్తాయి. వేడి కాచుకున్నా, బాడీ ఎంత వేడిగా ఉన్నా కూడా చేతులు, కాళ్లు మాత్రం ఇలానే ఉంటాయి. అయితే చలికి ఇలా జరుగుతుందని కొందరు అనుకుంటారు. కానీ కేవలం చలికాలంలోనే కాకుండా సాధారణ సీజన్‌లో కూడా ఇలానే కొందరికి అనిపిస్తుంది. జలుబు వల్ల ఇలా జరుగుతుందని కొందరు భావిస్తారు. కానీ ఇది కేవలం జలుబు వల్ల వచ్చే సమస్య కాదని నిపుణులు అంటున్నారు. శరీరంలో విటమిన్ల లోపం వస్తే ఇలానే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏ విటమిన్ లోపం వల్ల కాళ్లు, చేతులు చల్లగా అనిపిస్తాయి? ఇది ప్రమాదమా? దీనికి ఉపశమనం ఎలా? అనే పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎవరికైనా బాడీలో విటమిన్ బి12 లోపం ఏర్పడితేనే ఇలా కాళ్లు, చేతులు చల్లగా అనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్ శరీరంలో రక్తాన్ని పెంచడంతో పాటు రక్త ప్రసరణను సక్రమంగా జరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదే విటమిన్ బి12 లోపం ఏర్పడితే రక్త ప్రసరణ పూర్తిగా మందగిస్తుంది. దీని వల్ల శరీరంలోని అన్ని భాగాలకు కూడా ఆక్సిజన్ సరఫరా కాదు. దీనివల్ల మీకు చేతులు, కాళ్లు చల్లగా అనిపిస్తాయి. అలాగే విటమిన్ బి12 లోపం వల్ల నరాల సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ లోపం ఏర్పడితే ఒక్కసారిగా కాళ్లలో నొప్పి, లాగడం, జలదరింపు, బలహీనతగా అనిపిస్తుంది. అయితే ఈ సమస్యను క్లియర్ చేసుకోవాలంటే పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా చేపలు, గుడ్లు, చికెన్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. వీటితో పాటు పాలు, పెరుగు, సోయాబీన్ కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కాల్షియం లోపం వల్ల కూడా కాళ్లు, చేతులు చల్లగా అనిపిస్తాయి. కాబట్టి కాల్షియం ఉండే పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాల్షియం వల్ల కండరాలు, ఎముకలు బలపడతాయి. దీంతో లోపం తగ్గడంతో సమస్య తగ్గుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరిగే పదార్థాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు చల్లగా అనిపించకుండా ఉండాలంటే.. రోజూ ఉదయం సూర్యకాంతిలో ఉండాలి. కనీసం 15-20 నిమిషాలు అయిన సూర్యరశ్మిలో ఉండాలి. విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల కాళ్లు, చేతులు చల్లగా మారకుండా ఉంటాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.