https://oktelugu.com/

Vasthu Tips : ఈ చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో వాస్తు దోషానికి కారణం అవుతాయి… ఈ సింపుల్ చిట్కాలతో వాస్తు దోషాన్ని తొలగించుకోండి…

ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, ఒత్తిడి వంటివి ఉండే అవకాశం ఉంటుంది. వాస్తు దోషాలు ఉన్నాయని మీరు ఆ ఇంటిని వదిలి వేరే ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ చిట్కాలను మీ ఇంట్లో పాటించడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేసి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవచ్చు.

Written By:
  • Mahi
  • , Updated On : January 1, 2025 / 05:00 AM IST

    vasthu tips telugu

    Follow us on

    Vasthu Tips :  మన దేశ సంస్కృతిలో వాస్తు శాస్త్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. చాలామంది తమ ఇళ్ళను నిర్మించేటప్పుడు అలాగే ఇంట్లోని వస్తువులను సమకూర్చుకునేటప్పుడు తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఉండేలా చేస్తుందని అందరి నమ్మకం. ఒకవేళ ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, ఒత్తిడి వంటివి ఉండే అవకాశం ఉంటుంది. వాస్తు దోషాలు ఉన్నాయని మీరు ఆ ఇంటిని వదిలి వేరే ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ చిట్కాలను మీ ఇంట్లో పాటించడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేసి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవచ్చు. ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి సంపద పెరిగి అలాగే ప్రశాంతత ఉండాలంటే కొన్ని వాస్తు దోషాలను తొలగించాలి. చిటికెడు కర్పూరంతో ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కర్పూరం తో పాటు ఇంట్లో నీ నెగిటివ్ ఎనర్జీని తొలగించే మరికొన్ని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

    కర్పూరం: మీకు ఇంట్లో సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే ఆ నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి ఇంట్లోనే ప్రతి మూలలో చిటికెడు కర్పూరం ఉంచాలి. ఇది చెడు శక్తిని సమర్థవంతంగా తొలగిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే కర్పూరాన్ని మీ జేబులో గాని లేదా డబ్బులు దాచే ప్రదేశంలో గానీ ఉంచినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కర్పూరానికి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది. కరిగిపోయిన కర్పూరాన్ని ఎప్పటికప్పుడు మార్చాలి. ఎందుకంటే కరిగిపోయిన కర్పూరం దాన్ని ప్రభావాన్ని కోల్పోతుంది.

    విండ్ చైమ్స్ : ఇవి చూడడానికి బాగుండడంతోపాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ని కూడా క్రియేట్ చేస్తాయి. వీటి నుండి వచ్చే సౌండ్స్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వాటినే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వేలాడదీస్తే గుడ్ వైబ్స్ ను ఇంట్లోకి వెల్కమ్ చెప్పినట్లు అవుతుంది.

    అద్దాలు : వాస్తు శాస్త్రంలో ఇంట్లోని అద్దాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి లోపల అద్దాలను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా అద్దం పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇలా పెట్టడం వలన అవి ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీని బయటకు వెళ్లి పోయేలా చేస్తాయి. అలాగే పగిలిన అద్దాలు కూడా ఇంట్లో ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పగిలిన అద్దాలు ఇంట్లో ఉండడం వలన అవి దురదృష్టాన్ని తెస్తాయని అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆయుష్షును తగ్గిస్తాయని వాస్తు శాస్త్రం చెప్తుంది.
    పగిలిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు పారేయాలి: ఇంట్లో ఏవైనా పగిలిపోయిన వస్తువులు, గాజు వస్తువులు, చెడిపోయిన గడియారాలు వంటివి ఉంటే వాటిని వెంటనే పారేయాలి. అవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అభివృద్ధికి కూడా అవి ఆటంకం కలిగిస్తాయి.

    క్లీన్ ఎంట్రెన్స్: ఇంటి ప్రధాన ద్వారం నుంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. అందుకే ఆ ప్రదేశం ఇప్పుడు చాలా క్లీన్ గా, ఖాళీగా మరియు వెలుతురుగా ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మొక్కలు లేదా సుభ చిహ్నాలు ఏవైనా పెడితే ఇంట్లో శ్రేయస్సు కలుగుతుంది. ఇల్లు శుభ్రంగా ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.