https://oktelugu.com/

Bank Holidays January 2025 : రేపు సెలవు ఉంటుందా? ఈ సంవత్సరం బ్యాంకుకు ఎప్పుడెప్పుడు సెలవులు?

రేపు జనవరి 1, 2025న బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. జనవరి 1, 2025 బుధవారం RBI ఎందుకు సెలవు ఇచ్చిందో తెలుసా? 2024 సంవత్సరం అయిపోయి 2025 ప్రారంభంతో అనేక మార్పులు వస్తాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 1, 2025 / 06:00 AM IST

    Bank Holidays January 2025

    Follow us on

    Bank Holidays January 2025 : రేపు జనవరి 1, 2025న బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. జనవరి 1, 2025 బుధవారం RBI ఎందుకు సెలవు ఇచ్చిందో తెలుసా? 2024 సంవత్సరం అయిపోయి 2025 ప్రారంభంతో అనేక మార్పులు వస్తాయి. మరి మీకు మరో ప్రశ్న వచ్చిందా? జనవరి 1, 2025న బ్యాంకులకు సెలవు ఉంటుందా లేదా అనే అనుమానం వచ్చిందా? అయితే ఇప్పుడు ఆ డౌట్ ను క్లియర్ చేసుకోండి.

    అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025కి సంబంధించిన అధికారిక సెలవుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు, దీని కారణంగా ప్రజల్లో గందరగోళం నెలకొంది. కానీ రేపు అంటే 1 జనవరి 2025 బుధవారం బ్యాంకులకు సెలవు ప్రకటించారు. జనవరి 1, 2025 బుధవారం కొత్త సంవత్సరం సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025కి సంబంధించిన అధికారిక సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేయనప్పటికీ, జనవరి 1, 2025 గెజిటెడ్ సెలవుదినం కాదు. ఇది రిజిస్టర్డ్ సెలవుదినం.

    అయితే దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు లేదు. కానీ రేపు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు దినం. ఇది ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, ఇటానగర్, కొహిమా, కోల్‌కతాను కలిగి ఉన్న 2024 కోసం RBI సెలవుల జాబితా ప్రకారం నిర్ణయిస్తారు. అందువల్ల, అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ అవుతాయని ఖచ్చితంగా చెప్పలేము.

    బ్యాంకులకు సెలవులు ఉన్నా సరే ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉండడం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం. వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించి లావాదేవీలు చేయవచ్చు. దీంతోపాటు ఏటీఎం సేవలు కూడా యథావిధిగా అందుబాటులో ఉంటాయి. సెలవుల సమయంలో నగదు లేదా ఇతర బ్యాంకింగ్ అవసరాల కోసం, బ్యాంకులు ఆన్‌లైన్ సేవలు లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఖాతాదారులు ఏటీఎం ద్వారా కూడా నగదు తీసుకోవచ్చు.

    ఈ జనవరిలో ఏ రోజు సెలవులు ఉంటాయో తెలుసా?

    జనవరి 1, 2025 (బుధవారం): న్యూ ఇయర్ రోజు – దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

    5 జనవరి 2025 (ఆదివారం): వీక్లీ సెలవు ఉంటుంది.

    6 జనవరి 2025 (సోమవారం): గురు గోవింద్ సింగ్ జయంతి — చండీగఢ్, హర్యానాలో బ్యాంకులకు సెలవు.

    11 జనవరి 2025 (శనివారం): మిషనరీ డే – మిజోరాంలో సెలవు లేదు. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

    12 జనవరి 2025 (ఆదివారం): వారపు సెలవు, స్వామి వివేకానంద జయంతి సందర్బంగా పశ్చిమ బెంగాల్ లో సెలవు ప్రకటించారు.

    13 జనవరి 2025 (సోమవారం): లోహ్రీ – పంజాబ్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్ లో ఈ రోజు సెలవు.

    జనవరి 14, 2025 (మంగళవారం): సంక్రాంతి (చాలా రాష్ట్రాల్లో), పొంగల్ — తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో సెలవు.

    15 జనవరి 2025 (బుధవారం): తిరువల్లువర్ దినోత్సవం కాబట్టి తమిళనాడు, తుసు పూజ — పశ్చిమ బెంగాల్, అస్సాంలో సెలవులు ప్రకటించారు.

    19 జనవరి 2025 (ఆదివారం): వారపు సెలవు.

    23 జనవరి 2025 (గురువారం): నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లో సెలవు.

    24 జనవరి 2025 (శనివారం): నాల్గవ శనివారం కాబట్టి ఈ రోజు కూడా సెలవు.

    26 జనవరి 2025 (ఆదివారం): గణతంత్ర దినోత్సవం — అఖిల భారతం.

    30 జనవరి 2025 (గురువారం): సోనమ్ లోసర్ కాబట్టి ఈ రోజు సిక్కింలో సెలవు ప్రకటించారు.