Health Insurance: ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాణం ఎప్పుడూ ఉంటుందో? ఎప్పుడు పోతుందో? తెలియని పరిస్థితి. అయితే ఒక వ్యక్తి మరణిస్తే తను మాత్రమే జీవితాన్ని కోల్పోవడం కాదు తనపై ఆధారపడ్డ కుటుంబం కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రీ ప్లానింగ్ లేకపోవడం వల్ల కుటుంబం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరి జీవితానికి ఇన్సూరెన్స్ అనేది ఉంటే వ్యక్తులకు మాత్రమే కాకుండా తమ కుటుంబాలకు భరోసాగా ఉంటుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ లపై పూర్తిగా జీఎస్టీని తొలగించడంతో కొత్త పాలసీల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వ పాలసీలు మరియు తక్కువగా ఉన్నాయి. అలాంటి వాటిలో రోజుకు రూ.5.48.. చెల్లిస్తే రూ. 40 లక్షల బీమా కవరయ్యే పాలసీలు అందుబాటులో ఉన్నాయంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఇవే కాక మరికొన్ని ఉన్నాయి.. వాటి వివరాలు కి వెళ్తే..
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చాలావరకు ఇన్సూరెన్స్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రీమియం తక్కువగా ఉండడంతో పాటు పరిహారం భారీ మొత్తంలో అందిస్తున్నారు. వ్యక్తి రోజుకు రూ.5.48 చెల్లిస్తే.. అనగా ఏడాదికి రూ.2,000 ప్రీమియం చెల్లిస్తే రూ. 40 లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉంది. పాముకాటుతో మరణించే వారికి కూడా ఈ బీమా వర్తిస్తుంది.
అలాగే ఈ బ్యాంక్ ఆధ్వర్యంలో పీఎం సురక్ష బీమా యోజన పథకం కింద కూడా రూ. 2 లక్షల బీమా సదుపాయం అందుబాటులో ఉంది. ఈ బీమా కోసం ఏడాదికి కేవలం రూ.20 తెలిస్తే చాలు. 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు ప్రమాదంలో మరణించినా… రెండు చేతులు, కాళ్లు కోల్పోతే రూ.2 లక్షల బీమా పొందుతారు. అయితే పాక్షికంగా అవయవాలు దెబ్బతింటే రూ. లక్ష వరకు పరిహారాన్ని పొందవచ్చు. అలాగే పిఎం జీవనజ్యోతి బీమా కింద ఏడాదికి రూ. 436 ప్రీమియం చెల్లిస్తే రూ. రెండు లక్షల బీమా వర్తిస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు ఏ కారణం చేత మరణించినా కూడా..రూ. రెండు లక్షలు నామినీకి అందజేస్తారు. ఇక అటల్ పెన్షన్ యోజన కింద 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు నెలకు రూ.1000 నుంచి 5000 పింఛన్ పొందవచ్చు. వీటితోపాటు సహకార బ్యాంకుల్లో రూ.1,556 చెల్లిస్తే రూ. 20 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఒకవేళ డెంగ్యూ లేదా ఇతర జ్వరాల బారిన పడినవారు ఆస్పత్రిలో చేరితే వైద్య ఖర్చులకోసం రోజుకు రూ.10,000 చెల్లిస్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు తమ ఖాతాదారులకు ఉచితంగా జీవిత బీమా, ప్రమాద బీమా అందజేస్తున్నారు. అలాగే డెబిట్ కార్డ్ కలిగి ఉన్న వారు కూడా రూ.10 లక్షల బీమా అందుకోవచ్చు.