Indian American Zohran Mamdani: తాజాగా జరిగిన అమెరికా ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. భారత సంతతికి చెందిన జోహ్రాన్ మందానీ న్యూయార్క్ మేయర్ గా ఎన్నికవ్వడం సంచలనమైంది. జోహ్రాన్ భారత సంతతి కావడం వల్ల కాకుండా ఆయన కమ్యూనిస్టు భావాలు, విధానాల వల్ల పాపులర్ అయ్యాడు. ఆయన డెమొక్రాట్ సోషలిస్ట్ అని ప్రచారం చేసుకోవడం.. ఎక్కడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చిన న్యూయార్క్ నగరంలో ఒక ముస్లిం మేయర్ ఎన్నిక కావడం అమెరికా చరిత్రలోనే అరుదైన పరిణామం.
ఈ రెండూ సంచలనం.. న్యూయార్క్ అంటే ధనవంతుల నగరం.. మన దేశ మొత్తం జీడీపీలో సగం జీడీపీ న్యూయార్క్ కే ఉంటుంది. దానికి జోహ్రాన్ మేయర్ కావడం సంచలనం.. ఆయన విధానాలు వివరించి డెమొక్రటిక్ అభ్యర్థిగా గెలవడం సంచలనం. రిపబ్లికన్లకు ఇది ఓ షాకింగ్ వార్త.
భారత సంతతిలో జాహ్రాన్ తోపాటు వర్జీనియా గవర్నర్ గా గజాలా హష్మీ కూడా ఎన్నికయ్యారు. తర్వాత సిన్సినాటి నగర మేయర్ గా అఫ్తాఫ్ పురేహే ముగ్గురు భారత సంతతికి చెందిన వారితోపాటు ముస్లిం మతానికి చెందిన వారు కావడం గమనార్హం.
భారతీయ అమెరికన్ జోహ్రాన్ మందాని న్యూయార్క్ మేయర్ .. భారత సంతతి ఎదుగుదలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.