Health Care Tips: మనం తినే ఆహారాల్లో మనకు ఆరోగ్యాన్నిఇచ్చేవి ఉంటాయి. అనారోగ్యాన్ని తెచ్చేవి ఉంటాయి. ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది. మనం తీసుకునే ఆహారాలే మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి. ప్రొటీన్లు ఉండే వాటిని తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొన్ని ఆహారాలు మనకు పడవు. శరీరానికి పడకపోతే ఇబ్బందులు కలుగుతాయి. ఇంకా ఒకదానితో పాటు మరొకటి తింటే కూడా అనారోగ్యమే. వీటి గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం.

ఆయుర్వేదంలో పాలతో పాటు కొన్ని ఆహారాలు తీసుకుంటే ప్రమాదమే అని తెలియజేస్తున్నారు. 100 మిల్లీ లీటర్ల పాలలో 87.8 గ్రాముల నీరు ఉంటుంది. 4.8 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. 3.9 కొవ్వు, 3.2 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. 120 మిల్లీ గ్రాముల కాల్షియం, 1.4 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. దీంతో పాలతో పాటు కొన్ని ఆహారాలు కలిపి తీసుకుంటే ప్రమాదమే. వాటి గురించి తెలుసుకుని జాగ్రత్తపడి వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరంగా భావించాలి.
పాలతో పాటు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు ఇందులో ఉండే ప్రొటీన్లతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో సోయా, ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, చేపలు, మాంసం, ఉలవలు వంటివి తీసుకుంటే నష్టమే. జీర్ణక్రియ సమస్యలువస్తాయి. మనం తీసుకున్న ఆహారాలు జీర్ణం కాకుండా ఉంటే అజీర్తి సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా ఇబ్బందులు ఏర్పడతాయి. పాలతో పాటు చేపలు తినడం మంచిది కాదు. పాలు చేపలు కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు అజీర్తి సమస్య తెస్తాయి.

పాలు పండ్లు కలిపి తీసుకోకూడదు. పులుపు జాతికి చెందినవి అసలు తినకూడదు. పుల్లగా ఉండే పండ్లు నిమ్మ, దానిమ్మ, బత్తాయి తదితర పండ్లను పాలతో పాటు తీసుకుంటే కష్టమే. పాలు తాగిన తరువాత ఈ పండ్లు తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే పాలు తాగినప్పుడు ఇలాంటి పండ్లు తీసుకోకుండా ఉండటమే శ్రేయస్కరం. ఇలా చేస్తే వాంతుల, విరేచనాలు వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఆరోగ్యాభిలాషులు ఈ జాగ్రత్తలు తీసుకుని పాలతో పాటు వీటిని తీసుకోకుండా ఉంటేనే మంచిది.