Pawan Kalyan Unstoppable: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో నేడు రాత్రి 7 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు ఆహా మీడియా..ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఒక ట్వీట్ ని వేసింది ఆహా మీడియా..ఈమధ్యనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన చిన్న టీజర్ ని విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది..ప్రోమో ఉంటుందని అభిమానులు ఊహించలేదు.

టీజర్ తోనే సరిపెడుతారని అనుకున్నారు..కానీ ఫ్యాన్స్ ని నిరాశపర్చకుండా ఉండేందుకు నాలుగు నిమిషాల నిడివి ఉన్న ప్రోమో కట్ ని ఈరోజు రాత్రి మన ముందుకు తీసుకు రాబోతున్నారు..ఈ ప్రోమో కోసం కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగత ప్రశ్నలతో పాటుగా రాజకీయానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు అడిగాడు బాలయ్య..దానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాదానాలు చెప్పాడు అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ ఎపిసోడ్ ని ప్రభాస్ ఎపిసోడ్ లాగానే రెండు భాగాలుగా విభజిస్తారని తెలుస్తుంది..మొదటి భాగం ఫిబ్రవరి 5 వ తారీఖున టెలికాస్ట్ కానుంది..రెండవ భాగం ఫిబ్రవరి 14 న విడుదల చేయబోతున్నారట.

ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా హాజరయ్యాడు..ఇక మధ్యలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మరియు రామ్ చరణ్ తో ఫోన్ కాల్ సంభాషణ చేస్తాడు..ఇవన్నీ ఎపిసోడ్ కి హైలైట్స్ గా నిలవబోతున్నాయి..మరి ప్రభాస్ ఎపిసోడ్ లాగానే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా అభిమానుల ఆధారణని దక్కించుకుంటుందో లేదో చూడాలి.