Gotu Kola: చాలామంది ఇంట్లో పెంచే మొక్కలలో గోతుకోలా మొక్క కూడా ఒకటి. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం వంటకాల కోసం ఈ మొక్కను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. తీపి, చేదు రుచితో పాటు సువాసనను కలిగి ఉండే ఈ మొక్క ఆకులను వంటకాలలో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ మొక్కలను ఆయుర్వేద ఔషధంగా కూడా వినియోగించడం జరుగుతుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఈ మొక్కలు సుదీర్ఘమైన చరిత్రను కలిగి ఉంటాయి.

గోతుకోలా మొక్కల ద్వారా నాడీ వ్యవస్థ పునరుజ్జీవించి ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. గోతుకోలా మొక్కలు మచ్చలను నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. గోతుకోలా ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అకాల వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. గోతుకోలా పౌడర్ గా, క్యాప్సూల్ గా కూడా లభ్యమవుతుంది. గోతుకోలా మొక్కలు మెమొరీని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
అంటువ్యాధుల చికిత్స కొరకు గోతుకోలాను వినియోగించడం జరుగుతుంది. రక్తం గడ్డకట్టడం, అల్జీమర్స్ లాంటి సమస్యలు సైతం గోతుకోలా మొక్క వల్ల దూరమవుతాయి. మధుమేహం, విరేచనాలు, అలసట, అజీర్ణం, ఉబ్బసం, మానసిక ఆందోళన సమస్యలకు చెక్ పెట్టడంలో గోతుకోలా ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తల పరిశోధనల్లో సైతం గోతుకోలా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని తేలింది.
మలేషియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో దీర్ఘకాలిక సిరల లోపం సమస్యతో బాధ పడేవాళ్లకు రక్తప్రసరణను మెరుగుపరచడంలో గోతుకోలా అయితే ఉపయోగపడుతుంది. వృద్ధుల్లో రక్తప్రసరణను పెంచే గోతుకోలా మొక్క ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.