TCS recruitment: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 500 వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా టీసీఎస్ సంస్థ అడుగులు వేస్తోంది. ఐటీ రంగంలో ఉన్నతమైన కెరీర్ ను ఎంచుకోవాలని అనుకునే వాళ్లకు టీసీఎస్ తీసుకునే నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

సింగిల్ స్టేజ్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనంతో పాటు బోనస్, ఇతర సౌకర్యాలు లభించే అవకాశం అయితే ఉంటుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా టీసీఎస్ కంపెనీలలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుండగా నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, జావా డెవలపర్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఆంగ్యులర్ జేఎస్, ఒరాకిల్ డీబీఏ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు ఆటోమేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఐఓఎస్ డెవలపర్, విండోస్ అడ్మిన్, పైథాన్ డెవలపర్, పీఎల్ఎస్క్యూఎల్, డాట్నెట్ డెవలపర్ ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ చదివిన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా దేశంలోని నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరుగుతోంది. కంపెనీ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. నిరుద్యోగులు వెబ్ సైట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.