Heart Diseases: మనిషి తిండి విషయంలో ఏ నిబంధనలు పాటించడంలేదు. ఫలితంగా అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాడు. వంద ఏళ్లు సరిగా పనిచేసే అవయవాలు ముప్పై నలభై ఏళ్లకే పనికి రాకుండా చేసుకుంటున్నాడు. దీంతో బాధలు అనుభవిస్తున్నాడు. ఏ జంతువైనా అయితే శాఖాహారమో లేక మాంసాహారమో తింటుంది. కానీ మనిషి ఒక్కడే అటు శాఖాహారం, ఇటు మాంసాహారం రెండింటిని తీసుకుంటూ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు. వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో బీపీ, షుగర్, గుండెజబ్బులు తెచ్చుకుంటున్నాడు. వందేళ్లు హాయిగా జీవించాల్సిన శరీరాన్ని యాభై ఏళ్లకే ముగిస్తున్నాడు.

బ్రిటన్ లో గ్లాస్ట్రో విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు 4.20 లక్షల మందిపై పరిశోధనలు చేసి నిర్ధారణ చేశారు. మాంసాహారం తీసుకునే వారిలోనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని తేల్చారు. శాఖాహారులకు ఆ ప్రమాదం తక్కువేనని నిర్ధారించారు. అందుకే మన దేశంలో పూర్వ కాలంలో ఎక్కువ మంది మాంసాహారం తీసుకునే వారు కాదట. కాలక్రమేణా ఆంగ్లేయులు మనకు మాంసాహారం అలవాటు చేశారని తెలుస్తోంది.
మాంసాహారం తినేవారిలో 94.7 శాతం ఊబకాయం, గుండెజబ్బుల బారిన పడే ప్రమాదాలు ఉన్నాయి. అయితే చేపలు తినే వారిలో మాత్రం తక్కువేనని చెబుతున్నారు. దీంతో చేపలు తింటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే మంచిది. మాంసాహారం ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మాంసాహారం తీసుకోకుండా ఫిజాలు, బర్గర్ లు, కూల్ డ్రింక్ లు, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి తీసుకోవడం వల్ల కూడా అనర్థాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాంసం వినియోగం తగ్గించుకోవాలి. మాంసాహార ఉత్పత్తుల వాడకం మానేస్తే ఇంకా మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చేపలు తింటే పాలిఆన్ శాచురేటెడ్ కొవ్వు శరీరానికి అందడం వల్ల మేలు జరుగుతుతందని చెబుతున్నారు.
Also Read: ఆదివారం మాంసం ఎందుకు తినకూడదు?
ఇటీవల కాలంలో చాలా మంది మాంసాహారం తినేందుకు ఇష్టపడటం లేదు. గుండె జబ్బుల ముప్పు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకుని శాఖాహారమే తీసుకుంటున్నారు. దీంతో గుండె జబ్బులను దూరం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితిలో మార్పులు వస్తున్నాయి. ప్రజల్లో కూడా చైతన్యం వస్తోంది. శాఖాహారంతోనే సర్వ రోగాలు దూరం చేసుకోవచ్చని భావిస్తున్నారు.
గ్లాస్గో విశ్వవిద్యాలయం వారి పరిశోధనలను యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు. దీంతో మాంసాహారంతో అన్ని అనర్థాలే వస్తాయని వెల్లడించారు. దీంతో పాశ్చాత్య దేశాల్లో కూడా మాంసాహారాన్ని దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. పౌల్ట్రీ ఉత్పత్తులతో ప్రమాదకరమేనని చెబుతున్నారు. అందుకే వాటిని పూర్తిగా త్యజిస్తేనే మనకు రక్షణ అని తెలుసుకున్నారు.
Also Read: బ్యాన్ కాదు.. రీకాల్ మాత్రమే! ఎలక్ట్రిక్ టూ–వీలర్ అమ్మకాల కేంద్రం కీలక ప్రకటన..!
[…] […]
[…] […]