Wife Image as Whatsapp DP: సైబర్ నేరగాళ్లు స్టైల్ మారుస్తున్నారు. మోసాల్లో కొత్త దారులు వెతుకుతున్నారు. బలహీనతలే లక్ష్యంగా చేసుకుంటున్నారు. భార్యల ఫొటోలు డీపీగా పెట్టుకుంటే వాటిని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించినా తప్పించుకు తిరుగుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దేశంలో పనికిమాలిన పనులు చేయడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. కష్టపడకుండా సంపాదించాలని కలలు కంటూ ఎదుటి వారి కలలు కల్లలు చేస్తున్నారు. మోసాలే పెట్టుబడిగా కుయుక్తులు పన్నుతున్నారు.

తాజాగా చెన్నైలో ఓ ఘటన చోటుచేసుకుంది. అయ్యన్నవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. దీంతో సైబర్ నేరగాడు ఆ ఫొటోను తస్కరించి దాన్ని మార్ఫింగ్ చేసి నగ్నంగా తయారు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం వెతుకుతున్నారు.
సైబర్ క్రైం పోలీసులు ఎంత వెతికినా నిందితుడు మాత్రం పట్టుబడటం లేదు. ఈ కేసులో మరో కోణం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా తెలిసిన వారే ఆమె ఫొటోను సేవ్ చేసుకుని ఇలా బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారేమోననే సందేహాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి కేసులో ఇంకా వివరాలు తెలియడం లేదు. ఇంట్లోని మహిళలపై ప్రేమతో డీపీలు పెట్టుకోకండి. ఇలా సమస్యల్లో ఇరుక్కోకండి అంటూ పోలీసులు సలహా ఇస్తున్నారు.
ఒక వేళ డీపీ పెట్టుకున్నా మనకు తెలిసిన వారికి మాత్రమే కనిపించేలా చేసుకోండి. అందరికి కనిపిస్తే అంతే సంగతి. ఇలా మోసాలకు పాల్పడుతూ బెదిరింపులకు గురిచేస్తే వేధింపులు తట్టుకోవడం కష్టమే. అందుకే మనమే జాగ్రత్తగా ఉంటే మంచిది. అనవసర విషయాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా చూసుకోవాలి.
Also Read: మే డే ఎలా పుట్టింది..? ఆరోజుల్లో ఏం జరిగింది..?
సామాజిక మాధ్యమాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల ఆప్షన్లు సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. అందులోని మెలకువలు తెలుసుకుని వారు సామాన్యులతో ఆడుకుంటున్నారు. దీంతో మనం చేయని తప్పులకు బాధ్యత వహించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అందుకే మన జాగ్రత్తలో మనం ఉంటేనే అన్ని సవ్యంగా సాగుతాయి. ఎవరి కోసమో మనం మోసపోవడం జరుగుతోంది.
రాబోయే రోజుల్లో ఇంకా సాఫ్ట్ వేర్ రంగం విస్తరించి సైబర్ మోసాలు ఎక్కువయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్రోగ్రాముల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర పోస్టింగులు పెడితే మనకే ప్రమాదం. వీలైనంత వరకు మన పరిధిలో మనం ఉంటే ఏ రకమైన ఇబ్బందులు రావని తెలుసుకోవాలి.
Also Read: మోడీ వర్సెస్ కేసీఆర్.. ఇద్దరి మధ్య గ్యాప్