Soaked Raisins: ద్రాక్ష పండ్లను తినడం ద్వారా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. అయితే ద్రాక్ష పండ్లను ఎండబెట్టడం ద్వారా ఎండుద్రాక్షను తయారు చేయడం సాధ్యమవుతుంది. ఎండు ద్రాక్ష తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. ద్రాక్ష పండ్లలో ఏ స్థాయిలో పోషకాహార విలువలు ఉంటాయో ఎండుద్రాక్షలో కూడా అదేస్థాయిలో పోషకాహార విలువలు ఉంటాయి.

పాలలో కలిపి ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి మెరుగుపడే అవకాశం అయితే ఉంటుంది. పురుషుల్లో వీర్యం ఉత్పత్తి చేయడంతో పాటు లైంగిక శక్తిని పెంచడంలో ఎండు ద్రాక్ష ఉపయోగపడుతుంది. అందువల్ల పురుషులు తరచూ ఎండుద్రాక్షను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఎండుద్రాక్షలో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఎండుద్రాక్షలో ఉండే బి కాంప్లెక్స్ రక్తహీనతకు చెక్ పెట్టడంలో తోడ్పడుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల అలసట, అసిడిటీ, మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. రక్తపోటుతో బాధపడే వాళ్లు ఎండుద్రాక్ష తింటే బీపీ అదుపులో ఉంటుంది. ఎండుద్రాక్ష ఎర్ర రక్తకణాల ఉత్పత్తి విషయంలో సైతం తోడ్పడుతుందని చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఎండుద్రాక్షను నీళ్లలో నానబెట్టి ఉదయం తినడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
Also Read: Dussehra 2021: దసరా వచ్చిందయ్యా…
సంతానం లేని స్త్రీలు ఎండు ద్రాక్ష తినడం వల్ల అండాశయంలో లోపాలు తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్ల సమస్యకు సైతం చెక్ పెట్టడంలో ఎండుద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. పిల్లలు ఎండు ద్రాక్ష తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అందువల్ల తల్లిదండ్రులు సైతం పిల్లలు ప్రతిరోజూ ఎండుద్రాక్ష తినే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: Cooking oils: సామాన్యులకు కేంద్రం శుభవార్త.. భారీగా తగ్గిన వంటనూనెల ధరలు!