Ajwain: మనలో చాలామందిని తరచూ వేధించే ఆరోగ్య సమస్యలతో దగ్గు, అజీర్తి సమస్యలు ముందువరసలో ఉంటాయి. ఈ సమస్యలు చిన్న సమస్యలే అయినప్పటికీ ఈ సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు. ఈ సమస్యలకు పరిష్కారంగా మందులు వాడటానికి బదులుగా వామును వినియోగిస్తే మంచిది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో వాము ఎంతగానో ఉపయోగపడుతుంది.

మనలో చాలామందిని నిత్యం వేధించే ఆరోగ్య సమస్యలలో అసిడిటీ కూడా ఒకటి. గ్లాసు నీళ్లలో టీ స్పూన్ వాము, టీ స్పూన్ జీలకర్ర వేసి మరిగించి తాగడం ద్వారా అసిడిటీ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు. బాలింతలు వాము తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మహిళలను వేధించే అజీర్తి, మలబద్ధకం సమస్యలు వాము తినడం ద్వారా దూరమయ్యే అవకాశం ఉంటుంది.
గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్లు నీళ్లలో వామును మరిగించి తీసుకోవడం ద్వారా ఆ సమస్యలకు సులువుగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వాములో ఉండే నియాసిన్ వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వామును తీసుకోవడం వల్ల దగ్గు సమస్య దూరమవుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ సమస్యలకు చెక్ పెట్టడంలో వాము తోడ్పడుతుందని చెప్పవచ్చు.
నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వాళ్లు వామును నోట్లో వేసుకుని నమలడం ద్వారా ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. నెలసరి సమయంలో వాము తీసుకుంటే మహిళలకు మంచి ఫలితాలు ఉంటాయి. వామును రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువు సమస్య దూరమయ్యే అవకాశాలు ఉంటాయి.
Also Read: KCR Politics on Petrol Price Hike: పెట్రోల్ ధర తగ్గాలంటే ఏం చేయాలి?