Health Benefits: ఏదైనా పని ఎక్కువగా చేస్తే బాడీ అంతా నొప్పులు అయిపోతుంది. బాడీలో ఉన్న పెయిన్స్ అన్ని తగ్గాలని కొందరు వేడి నీటితో స్నానం చేయడం లేదా బాడీని మసాజ్ చేస్తుంటారు. మసాజ్ చేయడం వల్ల బాడీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా విముక్తి చెందవచ్చు. పూర్వ కాలంలో కొన్ని రకాల వ్యాధులను తగ్గించుకోవడానికి ఎక్కువగా మసాజ్ చేసేవారు. ఈ రోజుల్లో అందరూ ఇంగ్లీషు మందులు వాడుతున్నారు. కానీ పూర్వకాలంలో అయితే వీటితో పెద్దగా పని ఉండేది కాదు. సమస్య తీవ్రం అయితేనే వాడేవారు. ఎక్కువగా ఇలాంటి మసాజ్ చికిత్స పద్ధతులు ఆయుర్వేదంలోనే ఉపయోగించేవారు. బాడీలో ఎలాంటి సమస్య వచ్చిన కూడా మసాజ్ చేయడం వల్ల తొందరగా ఆ సమస్య తగ్గిపోతుంది. మసాజ్ చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తలపై మసాజ్ చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. మరి చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు శరీరానికి అందుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కండరాలు నొప్పులు
బాడీని మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారు బాడీని మసాజ్ చేస్తే తొందరగా ఈ సమస్య నుంచి విముక్తి చెందుతారు. రోజూ బాడీని మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల శరీరానికి కావాల్సిన బ్లడ్ అన్ని భాగాలకు ఈజీగా సరఫరా అవుతుంది. దీనివల్ల సగం సమస్యలు తగ్గుతాయి.
రోగనిరోధక శక్తి పెరగడం
రోజూ బాడీకి మసాజ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తొందరగా రావు. వీటి నుంచి విముక్తి చెందాలంటే అప్పుడప్పుడు బాడీకి మసాజ్ అనేది తప్పనిసరి.
ఒత్తిడి నుంచి విముక్తి
మసాజ్ వల్ల ఎలాంటి ఒత్తిడి, ఆందోళన ఉన్న కూడా విముక్తి చెందుతారు. రోజూ మసాజ్ చేయించుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొందరు చిన్న విషయాలకి కూడా ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి వారు మసాజ్ చేయించుకోవడం వల్ల ఎలాంటి టెన్షన్‌కి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
పాజిటివ్ ఎనర్జీ వస్తుంది
మసాజ్ చేయించుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మెరుగు అవుతుంది. నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనలకు దగ్గర అవుతారు. అలాగే హాయిగా కూడా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నా వారు రోజూ బాడీకి మసాజ్ చేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రపోతారు. అయితే మసాజ్ చేయించుకొనేటప్పుడు సరైన భంగిమలో ఉండి చేయించుకోవాలి. లేకపోతే బాడీ పెయిన్స్ కూడా కొన్నిసార్లు వచ్చే ప్రమాదం ఉంది.
చర్మ ఆరోగ్యం
మసాజ్ చేయించుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ ముఖాన్ని మర్దన చేస్తే కాంతివంతంగా చర్మం మారుతుంది. అలాగే జుట్టును కూడా రోజూ మసాజ్ చేయడం వల్ల ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు రాలిపోకుండా కూడా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.