https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు ఈ రెండు రాశుల వారికి అనుకోని ఆదాయం.. వద్దన్నా డబ్బు..

ఈరోజు ఈ రాశి వారు ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 13, 2024 / 07:54 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల పై ప్రభావం ఉంటుంది. బుధవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో సిద్ధియోగం ఏర్పడడంతో కన్య, కర్కాటక రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది. మరి కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం

    మేష రాశి:
    పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకొని ప్రయాణాలు ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం. జీతం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు గతంలో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. సమస్యల నుంచి బయటపడతారు.

    వృషభ రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రియమైన వారికోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు నగదు కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది.

    మిథున రాశి:
    కొన్ని పనుల కారణంగా చాలా బిజీగా ఉంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. ఇంట్లో శుభకార్యానికి ఆటంకం కలుగుతుంది. అయితే కొందరు వ్యక్తుల వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు.

    కర్కాటక రాశి:
    కొన్ని నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. అదనపు ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

    సింహారాశి:
    అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వైద్యులను సంప్రదించడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రమాదానికి గురై అవకాశం. కొత్తగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటే ఈరోజు అనుకూల సమయం.

    కన్య రాశి:
    వ్యాపారాలు అనుకోకుండా డబ్బును కోల్పోవచ్చు. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలు పొందలేరు. జీవిత భాగస్వామితో భవిష్యత్ ప్రణాళికలపై చర్చిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి.

    తుల రాశి:
    ఈరోజు ఈ రాశి వారు ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు.

    వృశ్చిక రాశి:
    ఈరోజు వారు ఈరోజు ఆత్మ సమాజంతో ముందు వెళ్తారు. ఆర్థికంగా ఎక్కువ లాభం పొందుతారు. వ్యాపారులు ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకున్న విజయం సాధిస్తారు. ఉద్యోగులు తోటి వారి నుంచి సలహా తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది. పిల్లల కోసం కొత్త వాహనం కొనాలని చూస్తారు.

    ధనస్సు రాశి:
    ఈ రాశి వారు ఇదివరకు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తారు. భవిష్యత్తులో ఎక్కువ లాభం వచ్చే పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామి నుంచి విలువైన సలహా తీసుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

    మకర రాశి:
    ఈ రాశి వారు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి వ్యాపారులకు ఆందోళనకరంగా ఉంటుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. వివాహితులు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

    కుంభరాశి:
    వస్తువుల కొనుగోలుకు ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు బిజీగా ఉంటారు. విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాయాలి. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు.

    మీనరాశి:
    కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ రోజు అనుకూల సమయం. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. వివిధ మార్గాల నుండి వ్యాపారులు ఆదాయాన్ని పొందుతారు.