https://oktelugu.com/

Kitchen tips: ఎన్ని రోజులు అయిన కొత్తిమీర ఫ్రెష్‌గా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి

కూరల్లో కొత్తిమీరను వాడటం వల్ల వంటలు టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఎన్ని రోజులు అయిన కూడా కొత్తిమీర పాడవ్వకుండా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2024 10:33 pm
    Coriander

    Coriander

    Follow us on

    Kitchen tips: సాధారణంగా వారానికొకసారి మార్కెట్‌కి వెళ్లి కావాలసినవి అన్ని తెచ్చుకుంటారు. కూరగాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలా అన్ని రకాలను తెచ్చుకుంటారు. కొత్తమీర, పుదీనా వంటి వాటిని అయితే వంటల్లో గార్నిష్, టేస్ట్ కోసం వాడుతారు. అయితే మార్కెట్ నుంచి కొత్తిమీర తీసుకొచ్చిన రోజు బాగానే ఉంటుంది. ఆ తర్వాత రోజు ఉదయానికే పాడవుతుంది. సాధారణంగా ఉంచిన కూడా నల్లగా కావడం, లేదా మొత్తం పాడవుతుంది. ఇలా కొత్తిమీర పాడైన కొద్దీ ప్రతీసారి కూడా మార్కెట్‌కి వెళ్లి కొనుక్కోలేం. కాబట్టి కొత్తిమీర ఎల్లప్పుడూ తాజాగా ఉండే విధంగా కొన్ని చిట్కాలు పాటించాలి. లేకపోతే కొన్న కొత్తమీర అనవసరంగా వృథా అయిపోతుంది. కూరల్లో కొత్తిమీరను వాడటం వల్ల వంటలు టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఎన్ని రోజులు అయిన కూడా కొత్తిమీర పాడవ్వకుండా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

     

    కొత్తిమీరను వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. కూరలు, సూప్‌లు, చట్నీల్లో ఎక్కువగా వాడుతారు. తాజాగా ఉన్న కొత్తిమీరను వంటల్లో వాడితేనే టేస్టీగా ఉంటాయి. లేకపోతే వాటి టేస్ట్ అంతా పోతుంది. చాలామందికి కొత్తిమీర అంటే ఇష్టం ఉంటుంది. కానీ కొందరికి ఈ వాసన కూడా పడదు. ఈ వాసన ఏదైనా వంటల్లో కనిపిస్తే అసలు వాటి జోలికి కూడా పోరు. అయితే కొత్తమీరను తాజాగా ఉంచుకోవాలంటే గ్లాసు నీటిలో వేర్లతో ఉంచాలి. దీన్ని ఇలా నీటిలో ఉంచేటప్పుడు అందులో కాస్త వెనిగర్ వేస్తే అవి తాజాగా ఉంటాయి. వెనిగర్ నీటితో కొత్తిమీరను ఉంచడం వల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. దీంతో మీరు వంటల్లో ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు. అలాగే కొత్తిమీర ఆకులను శుభ్రం చేసి వాటిని ఒక బాక్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఉంచడం వల్ల కూడా ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో కొత్తిమీరను ఉంచేటప్పుడు డైరెక్ట్‌గా పెట్టకుండా ఒక పేపర్ లేదా క్లాత్‌లో ఉంచి పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. డైరెక్ట్‌గా ఉంచితే కొత్తిమీర తొందరగా పాడవుతుంది. ఎప్పుడైనా కొత్తిమీరను ఫ్రిడ్జ్‌లో ఉంచితే గాలి వెళ్లని డబ్బాలో ఉంచడం మంచిది. దీనివల్ల కొత్తిమీర పాడవకుండా తాజాగా ఉంటుంది.

     

    కొత్తిమీరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు రోజూ కొత్తిమీర ఆకులు తింటే ఈ సమస్య నుంచి విముక్తి పొందుతారు. ఈ ఆకులు తొందరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అపానవాయువు, అతిసారం, ప్రేగు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారించడంలో కూడా కొత్తిమీర బాగా సాయపడుతుంది. అలాగే రక్తపోటును నియంత్రించడంలో కూడా కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది. వీటితో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కొత్తిమీర ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే కొత్తిమీర మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం, నియాసిన్ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేలా కాపాడతాయి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.