
Mark Wood : క్లాస్ రూమ్ లో ఎవడైనా ఆన్సర్ చెప్తాడు.. ఎగ్జామ్స్ లో రాసిన వాడికే ఒక రేంజ్ ఉంటుంది.. దీన్ని నిజం చేసి చూపించాడు లక్నో సూపర్ గేయింట్స్ బౌలర్ మార్క్ ఉడ్. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీశాడు. లక్నో జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. వుడ్ దెబ్బకు ఢిల్లీ జట్టు పిల్లి కూనలా వణికి పోయింది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఢిల్లీ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా నిలిచాడు.
గాయం వల్ల జట్టుకు దూరమైన మార్క్ ఉడ్.. ఈ మ్యాచ్ తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.. ఆరంభం నుంచే సరయిన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేసిన ఉడ్.. బంతులను స్వింగ్ కూడా చేశాడు. అద్భుతమైన పేస్ తో ఆకట్టుకున్నాడు. దీంతో ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా చేతులు ఎత్తేశారు..తన ఫామ్ ను వినియోగించుకున్న ఉడ్.. ఢిల్లీపై ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. ఇలా బంతితో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఐదేళ్ల తర్వాత.. ఐపీఎల్ ఆడుతున్న అతడు.. ఐదు వికెట్లతో అదరగొట్టాడు.
ఈ మ్యాచ్ లో సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్న ఉడ్.. ఒకే ఓవర్ లో ఢిల్లీ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా, ఆస్ట్రేలియన్ స్టార్ మిచెల్ మార్ష్ ఇద్దరినీ ఒకే ఓవర్ లో అవుట్ చేశాడు.. అయినప్పటికీ ఉడ్ సూపర్ బౌలింగ్ ఎక్కడా ఆగలేదు. తర్వాత కాసేపటికి సూపర్ బౌన్సర్ తో సర్ఫ రాజ్ ఖాన్ ను ఔట్ చేశాడు. ఇలా ఢిల్లీ బ్యాటింగ్ వెన్నెముకను విరిచిన అతను.. చివరి ఓవర్లో ఇద్దరు టెయిల్ ఎండర్లను ఔట్ చేసి ఐదు వికెట్లు నెలకూల్చాడు.. ఈ సీజన్ లో ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

ఇలా ఉడ్ రెచ్చిపోవడం చూసిన అభిమానులు మౌనంగా ఉండలేకపోయారు.. ఉడ్ బౌలింగ్ విన్యాసాలను తెగ మెచ్చుకుంటున్నారు. అలాగే ఢిల్లీ బ్యాటర్ల వైఫల్యాన్ని తెగ విమర్శిస్తున్నారు..” ఉడ్ భయ్యా ఐదు ఏళ్ల తర్వాత వచ్చావ్. ఐదు వికెట్లు తీశావ్. అవి బంతుల్లా..నిప్పు కణాలా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
First game and first five-for 🤩
Wood surely left a big Mark in our opening game 👏#LSGvDC | #IPL2023 | #LucknowSuperGiants | #LSG | #GazabAndaz pic.twitter.com/iOywKYe64O
— Lucknow Super Giants (@LucknowIPL) April 1, 2023