మనలో చాలామంది ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటూ ఉంటారు. అయితే నిబంధనల గురించి సరైన అవగాహన లేకపోవడం చాలా సందర్భాల్లో క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. తాజాగా ఒక వ్యక్తి బైక్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ వ్యక్తి ఉపయోగించిన బైక్ 346 సీసీ బైక్ కావడంతో కంపెనీ ఇన్సూరెన్స్ డబ్బులను చెల్లించాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.
ఇంజిన్ ఫెయిల్యూర్ లేదా తరుగుదల నష్టం సాధారణ పాలసీలో కవర్ కావు. కారుకు డ్యామేజ్ జరిగితే వెంటనే బీమా కంపెనీని సంప్రదిస్తే మంచిది. అలా చేయడం ద్వారా కంపెనీ సిబ్బంది నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఒక కారును కొనుగోలు చేసి ఆ కారును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడినా క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.
పాలసీని కొనుగోలు చేసే సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినా ప్రమాదం గురించి తప్పుడు సమాచారం ఇచ్చినా క్లెయిమ్ పరిష్కారం కాదు. కారు బాడీలో మార్పులు చేసినా, పాలసీలోని క్లాజులకు అనుగుణంగా కారును వినియోగించకపోయినా, వాహనం నడిపే వ్యక్తికి లైసెన్స్ లేకపోయినా, ప్రమాదం గురించి వెంటనే తెలియజేకపోయినా బీమా కంపెనీలు పరిహారం చెల్లించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.