https://oktelugu.com/

Beauty Of Kashmir: మంచుతో కప్పబడిన కాశ్మీర్ అందాలు చూశారా? అయితే ఈ వీడియోలో చూడండి..

కొన్ని సినిమాల్లో సాంగ్స్ వచ్చే బ్యాగ్రౌండ్ లో మంచు కొండలను చూస్తే ఉల్లాసంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. కానీ అన్ని వేళల్లో ఆ అందాలు కనిపించవు. కేవలం చలి కాలంలో మాత్రమే ఇవి కనిపిస్తాయి.

Written By: Srinivas, Updated On : November 19, 2024 3:32 pm
jammu kashmir

jammu kashmir

Follow us on

Beauty Of Kashmir: కొన్ని సినిమాల్లో సాంగ్స్ వచ్చే బ్యాగ్రౌండ్ లో మంచు కొండలను చూస్తే ఉల్లాసంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. కానీ అన్ని వేళల్లో ఆ అందాలు కనిపించవు. కేవలం చలి కాలంలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. అందువల్ల వింటర్ మొదలు కాగానే ఇలాంటి ప్రదేశాలని సందర్శించాలని కొందరు ప్లాన్ వేస్తుంటారు. మనదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఇలాంటి బ్యూటీఫుల్ ప్లేసెస్ ను చూడొచ్చు. ఇక్కడికి వెళ్లి మంచు తో ఎంజాయ్ చేయొచ్చు. అయితే జమ్మూ కాశ్మీర్ లో ఉండే ఏ యే ప్రాంతాల్లో ఇలాంటి అందాలు ఉంటాయో తెలుసా?

చలికాలం ప్రారంభం కాగానే కాశ్మీర్ పై మంచు దుప్పటి పరుచుకుంటుంది. ఎక్కడ చూసినా మంచు ముక్కలే కనిపిస్తాయి. 2024 ఏడాదిలో నవంబర్ 11 నుంచి జమ్మ కాశ్మీర్ ప్రాంతాల్లో మంచు కురవడం ప్రారంభం అయింది. దీంతో కొందరు అక్కడి దృశ్యాలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. శ్రీనగర్ -లెహ్ ప్రధాన రోడ్డుపై మంచు కురవడంతో ఇక్కడి ప్రాంతం అందంగా కనిపిస్తుంది. జోజిలా పాస్ వద్ద ఈ అందాలను చూడొచ్చు. అయితే ఇక్కడ మంచు ఎక్కువగా కురవడం వల్ల రోడ్డుపై రాకపోకలు ఇబ్బంది పెడుతాయి. కానీ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు రోడ్డుపై ఉన్న మంచును తొలగిస్తుంది. అయితే కొన్నిప్రమాదకరమైన రహదారులను మూసివేసింది.

కాశ్మీర్ అనగానే కొండలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి మంచుతో కప్పబడి ఉంటాయి. ఎత్తైన కొండలపై మంచు కనిపిస్తే ఆ కనువిందే భలేగా ఉంటుంది. కాశ్మీర్ లోని గుల్ మార్గ్ లోని అప్రావత్, సోన్ మార్గ్, గురేజ్, మొఘల్ రోడ్ ప్రాంతాల్లో ఉన్న కొండలపై 6 అంగుళాల వరకు మంచు కప్పబడింది. దీంతో ఇవి మంచుకొండలుగా మారిపోయాయి. వీటిలో ప్రధానంగా పర్యాటక ప్రదేశాలుగా చెప్పుకునే గుల్మార్గ్, సోనా మార్గ్ లో మంచు కప్పబడడంతో ఇక్కడి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. వీటితో పాటు కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్, గురెజ్, తులైల్, కుంజల్వాన్ ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడినాయి. శీతాకాలం ముందు పచ్చని చెట్లతో ఉన్న ఇక్కడిప్రదేశాల్లో ఇప్పుడు ఎటు చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. ఇక ఇళ్లపై కూడా పూర్తిగా మంచుకురవడంతో వాటి రూపురేఖలు మారిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో కిరాణా షాపులు, బైకులు మంచుతో కప్పబడినాయి. ఇక ఇప్పటికీ మంచు కురుస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో ఉంచారు.

జమ్మూ కాశ్మీర్ లో శీతాకాలంలో ఎక్కువగా మంచు కురవడం వల్ల ఇక్కడి ప్రదేశాలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఈ రహదారుల వెంట ప్రయాణించడం ప్రమాదకరం. అందువల్ల కొన్ని రహదారులను అధికారులు మూసివేశారు. తీవ్రంగా మంచు కురుస్తున్న బందిపోరా -గురేజ్ రహదారిని మూసివేశారు. ఈ మార్గంలో మంచు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే మంచు కారణంగా 16 ట్రక్కులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు ప్రయాణికులు కూడా తమ ప్రయాణాన్ని నిలిపివేసినట్లుతెలుస్తోంది. వీరిని బీఆర్వో సిబ్బంది రక్షించారు.