https://oktelugu.com/

Mechanic Rocky Trailer: మెకానిక్ రాకీ ట్రైలర్ రివ్యూ: విశ్వక్ సేన్ మాస్ నుండి మాస్ మసాలా ఎంటర్టైనర్, అదే హైలెట్!

హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా ట్రైలర్ విడుదల చేశారు. మెకానిక్ రాకీ ట్రైలర్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా?... రివ్యూలో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 19, 2024 / 03:06 PM IST

    Mechanic Rocky Trailer

    Follow us on

    Mechanic Rocky Trailer: గత ఏడాది విశ్వక్ సేన్ రెండు హిట్స్ నమోదు చేశాడు. గామి చిత్రంలో విభిన్నమైన పాత్ర చేశాడు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా కూడా పర్లేదు అనిపించుకుంది. విలేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓ మోస్తరు విజయం నమోదు చేసింది. విశ్వక్ కి సాలిడ్ హిట్ అయితే ఇంకా పడలేదు. విశ్వక్ సేన్ ఒక్క సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ కొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.

    ఈ క్రమంలో ఆయన మెకానిక్ రాకీ చిత్రం చేశాడు. మెకానిక్ రాకీ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. సునీల్, నరేష్ కీలక రోల్స్ చేశారు. మెకానిక్ రాకీ చిత్రానికి రవితేజ ముళ్ళపూడి దర్శకుడు. రజని తాళ్లూరి నిర్మించింది. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 22న విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు.

    మెకానిక్ రాకీ ట్రైలర్ నిడివి దాదాపు రెండున్నర నిముషాలు ఉంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మెకానిక్ రాకీ తెరకెక్కింది. హీరో ఒక మెకానిక్. తన గ్యారేజ్ అంటే బలమైన సెంటిమెంట్ ఉంటుంది. ఇక మెకానిక్ రాకీకి ఎదురైన ఇబ్బందులు ఏంటి? అతని జోలికి సునీల్ ఎందుకు వచ్చాడు? అనేది కథలు అసలు ట్విస్ట్. విశ్వక్ సేన్ ఎనర్జీ, యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్ కి హైలెట్ అని చెప్పాలి.

    అయితే ట్రైలర్ లో కొత్తదనం కనిపించలేదు. ఈ తరహా ట్రైలర్ ఓ మూడు దశాబ్దాల క్రితం కనిపించేవి. ఈ జనరేషన్ ఆడియన్స్ కి మాత్రం కొట్టని చెప్పొచ్చు. కథ, టేకింగ్ కూడా పాతకాలపు సినిమాలను తలపిస్తుంది. ట్రైలర్ పర్లేదు అన్నట్లుగా ఉంది. మరి మూవీ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.