https://oktelugu.com/

Smart Phone: మీ స్మార్ట్ ఫోన్ లో ఈ చిన్న రంధ్రాన్ని ఎప్పుడైనా గమనించారా..ఆ రంధ్రం ఎందుకుందో తెలుసా?

Smart Phone: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మనకు స్మార్ట్ ఫోన్ కనపడుతుంది.అయితే ఎంతసేపు మనం సెల్ ఫోన్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ వంటి వాటి గురించి చూస్తూ ఉంటాము కానీ సెల్ ఫోన్ బయట బాగాన్ని చాలామంది పరిశీలించరు. జాగ్రత్తగా సెల్ ఫోన్ పరిశీలించినట్లయితే స్మార్ట్‌ఫోన్ పై భాగంలో హెడ్‌ఫోన్ జాక్ పక్కనే ఓ చిన్న రంధ్రం ఉంటుంది. అసలు ఆ రంధ్రం ఎందుకు ఉంది?ఆ రంధ్రం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 1, 2021 / 09:47 AM IST
    Follow us on

    Smart Phone: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మనకు స్మార్ట్ ఫోన్ కనపడుతుంది.అయితే ఎంతసేపు మనం సెల్ ఫోన్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ వంటి వాటి గురించి చూస్తూ ఉంటాము కానీ సెల్ ఫోన్ బయట బాగాన్ని చాలామంది పరిశీలించరు. జాగ్రత్తగా సెల్ ఫోన్ పరిశీలించినట్లయితే స్మార్ట్‌ఫోన్ పై భాగంలో హెడ్‌ఫోన్ జాక్ పక్కనే ఓ చిన్న రంధ్రం ఉంటుంది. అసలు ఆ రంధ్రం ఎందుకు ఉంది?ఆ రంధ్రం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది చాలా మందికి తెలియక పోవచ్చు.అయితే ఆ రంధ్రం ఎందుకు ఉంచారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

    Smart Phone

    ఇలా సెల్ ఫోన్ లో హెడ్ ఫోన్ జాక్ పక్కనే ఉన్నటువంటి ఈ చిన్న రంధ్రాన్ని నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు.అసలు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అక్కడ ఎందుకు పెట్టారు దాని వల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయానికి వస్తే.. సాధారణంగా మనం ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండదు. కొన్నిసార్లు ట్రాఫిక్ లో ఫోన్ మాట్లాడాల్సి వస్తుంది అలాగే మరికొన్ని సార్లు గందరగోళ పరిస్థితులలో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాము. అలాగే థియేటర్స్ లో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు.

    Also Read: వ్యక్తి మరణించిన తర్వాత పాన్ కార్డు, పాస్ పోర్ట్ ఏమౌతాయో తెలుసా?

    ఇలాంటి గందరగోళ వాతావరణంలో ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు మన వాయిస్ అవతల వ్యక్తికి వినిపించాలంటే కష్టమవుతుంది. అందుకోసమే సెల్ ఫోన్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ పెట్టడం వల్ల మన చుట్టూ ఉన్న శబ్దం అవతల వారికి వినిపించకుండా కేవలం మన మాటలు మాత్రమే వినిపించేలా ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ పనిచేస్తుంది. ఇలా బయటి శబ్దాలను అడ్డుకోవడంతో మన వాయిస్ అవతల వారికి స్పష్టంగా వినిపిస్తుంది.

    hole-on-smart-phone

    అందుకోసమే ప్రస్తుతం వస్తున్న ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లో ఈ విధమైనటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అయితే కొన్ని సెల్ ఫోన్లలో ఫోన్ పై భాగంలో కాకుండా కెమెరా వైపు, కింది భాగంలోనూ, కొన్నింటికి సైడ్ కూడా ఇస్తూ ఉంటారు.ఈసారి ఏదైనా ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు ఈ రంధ్రానికి అడ్డుపెట్టి మాట్లాడటం వల్ల మన వాయిస్ అవతల వారికి క్లియర్ గా వినిపించదు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే మీరు కూడా ఒకసారి పరీక్షించాలి.

    Also Read: విచ్చలవిడి యాంటీ బయాటిక్స్‌తో చాలా ప్రమాదం.. హెచ్చరిస్తున్న వైద్యులు?