Rajinikanth: రజినీకాంత్ సంచలనం… సినిమాలకు గుడ్ బై!

రాజకీయాలకు గుడ్ బై చెప్పింది ఇదే కారణంతో. ఆరోగ్యం సహకరించడం లేదు. దేవుడు సైతం రాజకీయాలొద్దని ఆదేశించారని రజినీకాంత్ వివరణ ఇచ్చారు. అభిమానులు ఎంత గొడవ చేసినా రజినీకాంత్ తన నిర్ణయం మార్చుకోలేదు.

Written By: Shiva, Updated On : May 19, 2023 5:18 pm

Rajinikanth

Follow us on

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట. దర్శకుడు మిస్కిన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నటుడిగా రజినీ నాలుగు దశాబ్దాల ప్రస్థానం కలిగి ఉన్నారు. 170కి పైగా చిత్రాలు చేశారు. ఏడు పదుల వయసు దాటినా వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్నారు. ఇండియా వైడ్ మార్కెట్ కలిగిన హీరోల్లో రజినీకాంత్ ఒకరు. ఆయన చిత్రాల రికార్డ్స్ మరొకరు చేరుకోలేనివి. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక దశలో అమెరికాలో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు.

రాజకీయాలకు గుడ్ బై చెప్పింది ఇదే కారణంతో. ఆరోగ్యం సహకరించడం లేదు. దేవుడు సైతం రాజకీయాలొద్దని ఆదేశించారని రజినీకాంత్ వివరణ ఇచ్చారు. అభిమానులు ఎంత గొడవ చేసినా రజినీకాంత్ తన నిర్ణయం మార్చుకోలేదు. శాశ్వతంగా పాలిటిక్స్ కి దూరమయ్యాడు. సినిమాలు మాత్రం కొనసాగిస్తున్నారు. అది ఆయన అభిమానులకు పెద్ద ఊరట. అయితే త్వరలో వారికి ఊహించని షాక్ ఇవ్వబోతున్నారట. రజనీకాంత్ సినిమాలు మానేస్తున్నారట.

ఇది ఊహాగానం కాదు. పరిశ్రమకు చెందిన వ్యక్తి డైరెక్టర్ మిస్కిన్ తెలియజేశారు. రజినీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ఓ మూవీ చేయాలనుకుంటున్నారు. ఆ మూవీ సెట్ అయితే రజనీకాంత్ అదే చివరిది అవుతుంది అన్నారు. మిస్కిన్ మాటలను బట్టి చూస్తే… రజినీకాంత్ సినిమాలు మానేయాలనుకుంటున్నారు. లోకేష్ కనకరాజ్ తో మూవీ చేయాలనేది ఆయన కోరిక. అది తీరిన వెంటనే యాక్టింగ్ మానేస్తారు.

మిస్కిన్ కామెంట్స్ రజినీకాంత్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. సూపర్ స్టార్ అప్పుడే రిటైర్ కావడానికి లేదు. మరింత కాలం మాకోసం సినిమాలు చేయాలంటున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ చిత్రం చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. అలాగే ఆయన కూతురు దర్శకత్వంలో లాల్ సలామ్ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రజినీకాంత్ క్యామియో రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య రజినీకాంత్ చిత్రాలు తెలుగులో పెద్దగా ఆదరణ దక్కించుకోవడం లేదు. ఒకప్పటి మార్కెట్ ఆయనకు ఇతర భాషల్లో లేదు.