Check Bounce: బ్యాంకు ఖాతాల్లో తగినంత నగదు లేకపోవడం, చెక్కు మొత్తం బ్యాంకులోని బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉండడం, చెక్కుపై డ్రాయర్ సంతకం బ్యాంకులోని నమూనా సంతకం మధ్య తేడా ఉండడం కారణంగా చెక్కులు బౌన్స్ అవుతుంటాయి. చెక్కు జారీ చేసిన తేదీ నుంచి మూడు నెలల వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఆ టైం దాటితే బౌన్స్ అవుతుంది. మోసం, వివాదాలు, పరిస్థితుల మార్పు కారణంగా కూడా చెల్లింపులు నిలిపవేయాలని డ్రాయర్ బ్యాంకుకు సూచించవచ్చు. ఈ సమయంలో కూడా చెక్కు బౌన్స్ అవుతుంది.
చెక్కుతోపాటు మెమో..
ఇలా బౌన్స్ అయిన చెక్కులను బ్యాంకులు తిరిగి ఇవ్వడంతోపాటు మెమో జారీ చేస్తాయి. జారీ చేసిన చెక్కు మెమోతోపాటు న్యాయవాది మీకు చెక్ ఇచ్చిన వ్యక్తికి నోటీసు పంపవచ్చు. నోటీసు చూసిన తర్వాత 15 రోజులలోపు మీకు చెక్ ఇచ్చిన వారు మొత్తం మనీ పే చేస్తే నో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నోటీసు పంపినా డబ్బులు సెటిల్ కాకుంటే చెక్కు, మెమో, స్పీడ్ పోస్టు రశీదు లాయర్ నోటీసు పెట్టుకుని కోర్టులో కేసు వేయొచ్చు.
క్రిమినల్ నేరం..
ఎన్‌ఐ చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం చెక్ బౌ¯Œ ్స అనేది క్రిమినల్ నేరం. ఇలాంటి కేసును ఫైల్ చేస్తే , మీకు డబ్బు చెల్లించాల్సిన వ్యక్తి మీకు చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. పేర్కొన్న తేదీలోపు చెక్కు మొత్తాన్ని చెల్లించనట్లయితే, చెల్లింపుదారు చెక్ మొత్తంపై వడ్డీని స్వీకరించడానికి కూడా అర్హులు.
భద్రత ఇలా..
ఇలాంటి పొరపాట్లు జరుగకుండా భద్రతా చర్యలు తీసుకోవచ్చు. ముందుగా చెక్ క్లియర్ అయ్యే వరకు బ్యాంకు ఖాతాలో తగినంత డబ్బు ఉంచాలి. లేదా చెల్లింపును స్వీకరించడంలో సమస్య ఉంటే చెల్లింపుదారును సంప్రదించి సమస్య పరిష్కరించాలి. తద్వారా డబ్బులు సేఫ్‌గా ఉంటాయి. లేదంటే క్రమినల్ కేసు నమోదవుతుంది.