Hangover: మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. అవన్నీ పక్కన పెట్టి మరి కొందరు రోజూ తాగుతుంటారు. ఇలా డైలీ తాగడం వాళ్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసిన కూడా మానరు. వీరికి చెప్పిన వారికి చిరాకు రావాలే కానీ.. మద్యం తాగడం మాత్రం మానరు. ఈరోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా తాగుతున్నారు. తక్కువగా మందు తాగడం వల్ల ఆరోగ్యానికి ఏం కాదని ఫీల్ అవుతుంటారు. ఆరోగ్యానికి మంచిది కానిది తక్కువ తాగితే ఏంటి? ఎక్కువ తాగితే ఏంటి? మద్యాన్ని ఏ మోతాదులో తాగిన క్యాన్సర్, గుండె సమస్యలు, రక్త నాళ సమస్యలు వస్తాయి. మద్యం ఎక్కువగా తాగడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలు పక్కన పెడితే కొందరికి వాంతులు వంటివి అవుతాయి. ఆ తర్వాత ఉదయం లేచే సరికి హ్యాంగోవర్‌లా ఉంటుంది. కేవలం ఎక్కువగా తాగిన వాళ్లకు మాత్రమే ఇలా కాకుండా..పడని వాళ్లు తాగిన కూడా ఇలానే జరుగుతుంది. కొంచెం తాగిన కొందరికి వాంతులు అయిపోయి.. హ్యాంగోవర్‌లా అనిపిస్తుంది. రోజంతా ఈ హ్యాంగోవర్ కొందరిని ఇబ్బంది పెడుతుంటుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
రాత్రి తాగినప్పుడు ఏం అనిపించకపోయిన కూడా తర్వాత రోజు మాత్రం హ్యాంగోవర్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఏ పని చేయలేకపోవడం, తలనొప్పి వంటివి వస్తాయి. దీంతో చాలా చిరాకుగా ఉంటుంది. అయితే హ్యాంగోవర్ రావడానికి ముఖ్య కారణం బాడీ డీహైడ్రేషన్ కావడం. ఎందుకంటే మందు తాగడం వల్ల పూర్తిగా వాటర్ తాగరు. కొందరు అయితే భోజనం కూడా చేయరు. దీనికి తోడు రాత్రంతా కూర్చోని తాగడం వల్ల నిద్ర లేకపోతే హ్యాంగోవర్‌లా అనిపిస్తుంది. కాబట్టి మందు తాగిన కూడా నీరు ఎక్కువగా తాగాలి. దీనివల్ల మీకు హాంగోవర్‌లా అనిపించదు. వీటితో పాటు మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగితే హ్యాంగోవర్ తగ్గుతుందట. అలాగే అరటి, యాపిల్, దానిమ్మ వంటి వాటిని తినడం లేదా సలాడ్‌లా తయారు చేసుకుని తినడం వల్ల హ్యాంగోవర్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
హ్యాంగోవర్ ఉంటే కొందరు పని చేస్తారు. ఇలా చేస్తే ఇంకా ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి హ్యాంగోవర్ ఉంటే మాత్రం కొంత సమయం విశ్రాంతి తీసుకోండి. దీనివల్ల మీకు కాస్త రిలీఫ్ ఉంటుంది. ఉదయాన్నే మసాలా, హెవీ ఫుడ్స్ తీసుకోకుండా ప్రొటీన్లు ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకోకూడదు. వీటివల్ల మీ హ్యాంగోవర్ సమస్య ఇంకా పెరుగుతుంది. హ్యాంగోవర్ నుంచి బయట పడటానికి గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటివి తాగాలి. లేకపోతే టామాటా జ్యూస్, ఆరెంజ్ వంటి జ్యూస్‌లు కూడా తాగవచ్చు. వీటితో పాటు వ్యాయామం చేయడం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల కాస్త మీకు రిలాక్స్‌గా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.