Malnutrition : శరీరానికి పోషకాలు చాలా అవసరం. పోషకాలు లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఆహారాన్ని గురించి తెలుసుకుంటూ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. పోషకాహార లోపం ఏర్పడితే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోషకాహార లోపం అనేది శరీరానికి అవసరమైన పోషకాలు లేని పరిస్థితిని తెలుపుతుంది. ఇది పేలవమైన పెరుగుదల, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. అందుకే ఈ పోషకాహార లోపాన్ని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి దీన్ని ఎలా గుర్తించాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే..
పోషకాహార లోపం ఉంటే చాలా మంది బరువు తగ్గుతారు. అది కూడా వేగంగా బరువు తగ్గుతుంటారు. ఇలా ఉంటే కచ్చితంగా కేలరీలు లేదా పోషకాల లోపం అనుకోవాల్సిందే. ఇది శక్తి స్థాయిలు, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కుంగిపోయిన గ్రోత్. అంటే పిల్లల పెరుగుదల కూడా తగ్గిపోతుంది. తగినంత మాంసకృత్తులు, కేలరీల తీసుకోకపోతే పిల్లలు ఎత్తు, బరువు పెరగడం ఆలస్యం అవుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ పోషకాహార లోపం వల్ల తెల్ల రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది.
అలసట కూడా వస్తుంది. ఎందుకంటే ఐరన్, బి విటమిన్లు వంటి అవసరమైన పోషకాల కొరత దీర్ఘకాలిక అలసట, పేలవమైన ఏకాగ్రతకు కారణమవుతుంది. జుట్టు కూడా పల్చబడుతుంది. జింక్, విటమిన్లు, ప్రోటీన్లలో లోపాలు పెళుసు జుట్టు, పొడి, పొరలుగా మారడం వంటి సమస్యలకు దారితీస్తాయి. అంతేకాదు జుట్టు చిట్లడం, జుట్టు ఊడిపోవడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యల బారిన కూడా పడతారు. కండరాల క్షీణత ఏర్పడుతుంది. తగినంత ప్రోటీన్ లేకపోతే కండర ద్రవ్యరాశిని కోల్పోయేలా చేస్తుంది. శారీరక బలం తగ్గుతుంది. మీరు బలంగా ఉండాలంటే పోషకాలు అవసరం.
బొడ్డు కూడా ఉబ్బినట్టు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో, పొత్తికడుపులో ద్రవం నిలుపుదల వంటి సమస్య వస్తుంది. ఇది ప్రోటీన్ లోపం వల్ల కూడా సంభవిస్తుంది. గాయాలు నయం కావడానికి చాలా సమయం పట్టవచ్చు. విటమిన్ సి జింక్ లోపాలు కణజాల మరమ్మత్తును దెబ్బతీస్తాయి. గాయం నయం చేయడం నెమ్మదిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముగ్గురిలో ఒకరికి పోషకాహార లోపం ఉందని అంచనా వేశారు నిపుణులు. విటమిన్ లేదా ఖనిజాల లోపం, అధిక బరువు, ఊబకాయం లేదా ఆహార సంబంధిత నాన్‌కమ్యూనికేబుల్ వ్యాధులు వస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పోషకాహార లోపం సర్వసాధారణం గా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ మురికివాడల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పోషకాహార లోపంపై అధ్యయనాలు చేయడానికి జనాభాను విభజించి మరీ అధ్యయంన చేశారు. అందులో శిశువులు, ఐదేళ్లలోపు పిల్లలు, పిల్లలు, కౌమారదశలు, గర్భిణీ స్త్రీలు, పెద్దలు, వృద్ధులు వంటి సహా వివిధ సమూహాలు