Hair home remedies : వాతావరణ కాలుష్యంతో పాటు.. కల్తీ మయమైన ఆహారం తీసుకోవడంతో మనుషులు అనేక రోగాల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. అలాగే చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపించే విధంగా జుట్టు తెల్లబడుతుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి కి జుట్టు సమస్య తీవ్రంగా వేధిస్తుంది. వయసు ఎక్కువగా కాకముందే జుట్టు తెల్లబడడంతో ఆందోళన చెందుతున్నారు. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి అనేక రకాల రసాయనాలు వాడుతున్నారు. కొందరు హెయిర్ డై లేదా కలర్ వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నా.. దీనికి శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అయితే ఇంట్లోనే ఈ చిన్న ట్రిక్ ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
పురుషులు లేదా మహిళలు తమ అందాన్ని ప్రదర్శించడానికి తెల్ల జుట్టు అడ్డం వస్తుంది. మహిళలు అయితే తెల్ల జుట్టు కనిపిస్తే తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. దీంతో మార్కెట్లో దొరికే అనేక రకాల రసాయనాల క్రిములు వాడుతున్నారు. వీటివల్ల తెల్ల జుట్టు నల్లగా మారడం అటు ఉంచితే.. అనేక రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. మరికొందరు ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయని భయపడి తెల్ల జుట్టును అలాగే ఉంచేస్తున్నారు. కానీ వీరు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు.
అయితే పూర్వకాలంలో చాలామందికి ఇలాంటి సమస్యలు ఉండేవి కావు. అంతేకాకుండా ఇలాంటి సమస్యలు వచ్చినా వారు చిన్నచిన్న పదార్థాలతో జుట్టును నల్లబరుచుకునేవారు. ఇప్పుడు కూడా కొన్ని చిన్న పదార్థాలతో జుట్టును నలబరుచుకోవచ్చు. ఇలా నల్ల పరుచుకున్న జుట్టును తిరిగి తెల్లగా మారే అవకాశం అస్సలు లేదని కొందరు నిపుణులు అంటున్నారు. అదెలా అంటే?
Also Read: సుడిగాలి సుధీర్ కి జరిగినదానికి బాధపడ్డాను, సంచలనంగా అనిల్ రావిపూడి కామెంట్స్, ఇంతకీ ఏం జరిగింది?
ప్రతి ఇంట్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉంటుంది. కూరలో ఉల్లిపాయ లేకుంటే రుచి ఉండదు. అయితే ఇంట్లోకి తీసుకువచ్చిన ఉల్లిపాయలను కూరకు వాడుకొని మిగతా వేస్టేజ్ ని పక్కన పెట్టుకోవాలి. అంటే ఉల్లిపాయ ఉండే పొట్టును సేకరించి ఒక పాత్రలో వేసుకోవాలి. ఇలా సేకరించిన ఉల్లిపొట్టును ఒక పాత్ర పై వేయించుకోవాలి. ఇది నల్లగా మారేంతవరకు వేయించాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని బాదం గింజలను తీసుకోవాలి. వీటిని ఒక పాత్ర పై నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి. ఇలా రెండింటిని కలిపి ఒక గ్రైండర్లో వేసి మిక్సీ చేయాలి. పొడిగా మారిన తర్వాత దానిని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిని జల్లెడ ద్వారా సరిచేసుకొని సన్నం పిండిలాగా వచ్చే దానిని సేకరించుకోవాలి. నల్లగా ఉండే ఈ పిండిలో కాస్త కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తెల్ల జుట్టు ఉన్నచోట రాస్తే సరిపోతుంది. ఇలా రాసిన కాసేపటికి జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఒకసారి ఇలాగా మారిన తర్వాత జుట్టు మరోసారి తెల్లగా మారే అవకాశం లేదని అంటున్నారు. అయితే ఈ ప్రయోగం చేసే సమయంలో తక్కువగా జుట్టు ఉన్న ప్రదేశంలో చేయాలి. ఎలాంటి సమస్యలు లేకపోతే మిగతా జుట్టుకు వేసుకోవాలని అంటున్నారు. ఈ విధంగా ఇంట్లోనే తెల్ల జుట్టును నల్ల పరుచుకునే ప్రయత్నం చేయొచ్చు.