Chandrababu New Scheme: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పేద ప్రజల్లో జీవన ప్రమాణాలు పెంచేందుకు గాను ఈ పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. గతంలో జన్మభూమి, శ్రమదానం అంటూ సొంత ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా ప్రతి వర్గాన్ని ప్రోత్సహించారు. అప్పట్లో ఈ రెండు అంశాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు వాటిని స్ఫూర్తిగా తీసుకొని..’మార్గదర్శి- బంగారు కుటుంబాలు’ పేరిట ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. తమ ప్రాంతంలో ఉండే అత్యంత నిరుపేదల అభివృద్ధికి సంపన్నులు ముందుకు వచ్చి.. వారిని దత్తత తీసుకునేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే అధికారులు, సిబ్బంది నిరుపేదల సర్వేను పూర్తి చేశారు. కానీ వారిని ఆదుకునేందుకు సంపన్న వర్గాలు ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టు ముందుకు రావడం లేదు. ఆపై జన్మభూమితో పాటు శ్రమదానం కార్యక్రమానికి లభించిన ఆదరణ కూడా లేదు.
Also Read: పురందేశ్వరికి అదే మైనస్.. బిజెపి జాతీయ పగ్గాలు కష్టమే!
ఈ ఏడాది ఉగాది నుంచి
ఈ ఏడాది ఉగాది నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu). సమాజంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న 20 శాతం మందిని.. సంపన్న వర్గాలుగా ఉన్న 10 శాతం మంది ఆదుకోవాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సాయం కోసం ముందుకు వచ్చే సంపన్నుడిని మార్గదర్శిని.. సాయం పొంది నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా వర్ణిస్తూ..’ మార్గదర్శి.. బంగారు కుటుంబాలు’ పథకంగా నామకరణం చేశారు. అయితే నిరుపేదల సర్వే పూర్తవుతున్న.. కనీస స్థాయిలో సంపన్న వర్గాలు మాత్రం సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం ఈ పథకానికి ప్రధాన లోటు. దీని అమలు విషయంలో సైతం ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి.
Also Read: సన్నిబియ్యం తింటున్నారా అక్కా.. రేవంత్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్
అవగాహన పెంచితేనే సక్సెస్..
క్యాబినెట్ లో( cabinet) ఉన్న చాలామంది మంత్రులు నిరుపేదలను దత్తత తీసుకున్నారు. ఎమ్మెల్యేలు సైతం ముందుకు వస్తున్నారు. కానీ అంతకుమించి గ్రామాల నుంచి బయటకు వెళ్లి ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు మాత్రం ముందుకు రావడం లేదు. చాలామందికి అవగాహన కూడా లేదు. అయితే ఈ పథకం విషయంలో సంపన్న వర్గాలకు, ఆదాయ పనులు పడుతున్న వారికి.. పన్నుల విషయంలో కొంత వేసులబాటు కల్పిస్తే మాత్రం సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కానీ కార్యక్రమం పట్ల చాలామందికి అవగాహన లేదు. సాధారణంగా సొంత గ్రామాల పట్ల సంపన్న వర్గాలకు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారికి ఎంతో అభిమానం ఉంటుంది. అటువంటివారు ఊరికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఉంటారు. అటువంటివారిని భాగస్వామ్యం చేస్తే మాత్రం ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.