https://oktelugu.com/

Guru Nanak Jayanti: గురునానక్ జయంతి బ్యాంకులకు సెలవు ఉందా? నవంబర్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకు హాలీడేస్?

భారతదేశం ఆధ్యాత్మికానికి నిలయం. ఇక్కడ భిన్న మతస్థులు ఉన్నారు. వారి గురువులను, దేవుళ్లను పూజిస్తూ ఆహ్లదంగా గడుపుతారు. ఈ తరుణంలో ఆయా మతాల వారిని గౌరవిస్తూ ప్రభుత్వం వారి పండుగలు, ప్రత్యేక దినాల్లో సెలవులను ప్రకటిస్తూ ఉంటుంది.

Written By: Srinivas, Updated On : November 15, 2024 11:25 am
Bank-Holiday

Bank-Holiday

Follow us on

Guru Nanak Jayanti: భారతదేశం ఆధ్యాత్మికానికి నిలయం. ఇక్కడ భిన్న మతస్థులు ఉన్నారు. వారి గురువులను, దేవుళ్లను పూజిస్తూ ఆహ్లదంగా గడుపుతారు. ఈ తరుణంలో ఆయా మతాల వారిని గౌరవిస్తూ ప్రభుత్వం వారి పండుగలు, ప్రత్యేక దినాల్లో సెలవులను ప్రకటిస్తూ ఉంటుంది. రెండో శనివారం, ఆదివారాలతో పాటు ఈ ప్రత్యేక రోజుల్లోనూ పాఠశాలలు, బ్యాంకులకు సెలవులు ఇస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులను సెలవులను నిర్ణయిస్తుంది. కొన్ని జాతీయ సెలవులను ప్రకటించగా…మరికొన్ని ఆయా బ్యాంకులకు ప్రాంతీయ పరిస్థితుల ఆధారంగా సెలవులను నిర్ణయిస్తుంది. దసరా, దీపావళి, రంజాన్ వంటి జాతీయ సెలవులతో పాటు సంక్రాంతి వంటి ప్రాంతీయ పండుగల్లోనూ సెలవులను కేటాయిస్తారు. అయితే గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుందా? అని కొందరికి సందేహం. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం నిర్ణయించిందంటే?

సిక్కుల మత గురువు గురునానక్ జన్మించిన రోజును ఆ మతస్థులు గురునానాక్ జయంతిని నిర్వహించుకుంటారు. ప్రతీ ఏడాది నవంబర్ 15న గురునానక్ జయంతిని నిర్వహిస్తారు. గురునానక్ జయంతిని గురునానక్ పురబ్ లేదా గురు నానక్ ప్రకాశ్ అని కూడా అంటారు. 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని నిర్వహించుకుంటున్నారు. సిక్కులకు సంబంధిచిన గురువులలో మొదటి గురువు గురునానక్ దేవ్ జీ 1469 ఏప్రిల్ 15న పంజాబ్ రాష్ట్రంలోని తల్వాండిలో జన్మించారు. కళ్యాణ్ చంద్ దాస్ బేడి, కళ్యాణ్ దాస్ మెహతాలు ఈయన తల్లిదండ్రులు. గురునానయక్ జయంతి రోజున పలు చోట్ల దీపాలు వెలిగిస్తారు.

15వ శతాబ్దంలో సిక్కుమతం ప్రారంభం అయింది. గురునానక్ దేవ్ ప్రజలకు మత బోధనలు చేశారు. స్వచ్ఛత, మంచితనం, నిస్వార్థ సేవ సూత్రాల ఆధారంగా వీరి బోధనలు ఉంటాయి. మనుషుల మధ్య భేదాలు లేకుండా అంతా సమానమే అన్నట్లు వీరి బోధనలు ఉంటాయి. సామాజిక న్యాయం కోసం నిస్వార్థంగా సేవ చేయాలని వీరి మత బోధనల్లో ఉంటుంది. గురునానయక్ చేసిన బోధనలకు గుర్తుగా ఆయన జయంతి రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్న గురునానక్ మందిరాల్లో గురు గ్రంథ్ ను 48 గంటల పాటు నిరంతరాయంగా చదువుతారు. ఈ కార్యక్రమానికి ఒకరోజు ముందు ‘నగర కీర్తన’ ఉంటుంది. ఈ సందర్భంగా వరు కొన్ని జెండాలను పట్టుకొని పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తారు.

గురునానక్ జయంతి సందర్భంగా ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సెలవునుప్రకటించింది. దేశంలోని మిజొరాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో సెలవును ప్రకటించారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో కార్తీక పౌర్ణమి కూడా ఉండడంతో ఈరోజు సెలవునుప్రకటించారు. సాధారణంగానే గురునానక్ జయంతి రోజున బ్యాంకులకు సెలవును ప్రకటిస్తారు. ఇదే రోజు కాకుండా నవంబర్ 18న కనకదాస్ జయంతి, 23న సెంగ్ కుట్న్సేమ్ సందర్భంగా సెలవులు ప్రకటించారు. వీటికి ోడు నవంబర్ లో 17,24 రోజుల్లో ఆదివారాలు, 23న రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగల నేపథ్యంలో మరికొన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండే అవకాశం ఉంది.