
GT vs CSK IPL 2023 : క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న IPL సీజన్ నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో ఘనంగా ప్రారంభం అయ్యింది.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన బౌలింగ్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేసింది.కానీ బీభత్సమైన బ్యాటింగ్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ని ఎదురుకున్నారు.
రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో సుమారుగా 176 పరుగులను చేసిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ స్కోర్ డిఫెండ్ చేసుకోవడం లో విఫలం అయ్యింది.గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఆర్డర్ మరియు ఫీల్డింగ్ కోసం వాళ్ళు పెట్టిన ఎఫ్ర్ట్స్ అద్భుతం అనే చెప్పాలి.ఆ రేంజ్ బౌలింగ్ లైనప్ చెన్నై సూపర్ కింగ్స్ కి లేకపోవడమే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అయ్యింది.గత IPL సీజన్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి ఇదే సమస్య.
అద్భుతమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది కానీ, సరైన బౌలర్లు లేరు.ఈరోజు జరిగిన మ్యాచ్ లో కూడా అదే సమస్య, ఈ బౌలింగ్ లైనప్ తో చివరి దాకా మ్యాచ్ సాగింది అంటే అందుకు కారణం మహేంద్ర సింగ్ ధోని అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ అనే చెప్పాలి.అయితే ఆయన నాల్గవ వికెట్ డౌన్ అయ్యినప్పుడే బ్యాటింగ్ చెయ్యడానికి వచ్చి ఉంటే రుతురాజ్ గైక్వాడ్ కి మంచి సపోర్టు దొరికి ఉండేది.
స్కోర్ 200 కి పైగా చేసేది,మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండేది.కానీ ఆ అవకాశాలన్నీ మిస్ చేసుకుంది ఈ చిన్న పొరపాటు కారణంగా.అంతే కాదు వికెట్ కీపింగ్ చేస్తున్న సమయం లో ధోని ఒక బాల్ ని క్యాచ్ చెయ్యడం లో మిస్ అయ్యాడు.అందువల్ల డెత్ ఓవర్లలో నాలుగు పరుగులు ఊరికినే ఇచ్చినట్టు అయ్యింది.ఇలా కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ని చెన్నై సూపర్ కింగ్స్ చిన్న చిన్న పొరపాట్లు వల్ల ఓడిపోవాల్సి వచ్చింది..తర్వాత మ్యాచుల నుండైనా బౌలింగ్ లో మెరుగుపడుతారో లేదో చూడాలి.