
Hyper Aadi Marriage: బుల్లితెర సూపర్ స్టార్ హైపర్ ఆది పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఫారిన్ అమ్మాయిని. తన భార్యను శ్రీదేవి డ్రామా కంపెనీ వేదిక మీద పరిచయం చేశాడు. హైపర్ ఆది భార్యను చూసి బుల్లితెర సెలెబ్రిటీలు, ఆడియన్స్ షాక్ అయ్యారు. నేను నా భార్యతో హనీ మూన్ కి వెళ్ళిబోతున్నానని ఆది అన్నాడు. దాంతో ఇంతకీ మీ ఆవిడ ఎవరని యాంకర్ రష్మీ అడిగింది. అప్పుడు వేదికపైకి ఓ ఫారిన్ అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. ఈవిడే మా ఆవిడ అని ఆది పరిచయం చేశాడు. ఆమె మాస్క్ పెట్టుకొని ఉన్నారు. మాస్క్ తీసేయ్… వాళ్ళందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు అని ఆది అన్నాడు.
హైపర్ ఆది భార్య మాత్రం మాస్క్ తీసేది లేదంది. ఒకసారి తీయవే… నేను కూడా ఇంత వరకూ చూడలేదు, అని పంచ్ వేశాడు. అర్థమైంది కదా… హైపర్ ఆది నిజంగా పెళ్లి చేసుకోలేదు. ఇది కేవలం స్కిట్ లో భాగం. నా భార్య ఎవరో చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల జనాలు కోరుకుంటున్నారన్న ఆది, ఒక కామెడీ స్కిట్ చేశాడు. ఈ స్కిట్ కోసం ఫారిన్ అమ్మాయిని తెచ్చాడు. హైపర్ ఆది పంచులు ఎప్పటిలాగే నవ్వులు పూయించాయి.

ఇక ఏజ్ బార్ బుల్లితెర సెలబ్రిటీలలో హైపర్ ఆది ఒకరు. ఆది కూడా థర్టీ ప్లస్ లో ఉన్నాడు. సుధీర్ మాదిరి మనోడు కూడా పెళ్లి మాట ఎత్తడం లేదు. హైపర్ ఆది కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి విషయం పక్కన పెట్టాడు. జబర్దస్త్ షోతో ఆది వెలుగులోకి వచ్చాడు. తన కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ అయ్యాడు. ఏళ్ల తరబడి జబర్దస్త్ లో హైపర్ ఆది హవా నడిచింది. హైపర్ ఆది&రైజింగ్ రాజు టీమ్ అద్భుతాలు చేసింది. సుడిగాలి సుధీర్ టీమ్ కి పోటీ ఇచ్చిన టీమ్ ఏదైనా ఉందంటే అది హైపర్ ఆది టీమే.
ఈ మధ్య హైపర్ ఆది సినిమా రచయితగా కూడా మారారు. ధమాకా, సార్ చిత్రాలకు హైపర్ ఆది డైలాగ్స్ రాసినట్లు సమాచారం. ఈ రెండు చిత్రాల్లో హైపర్ ఆది కీలక రోల్స్ చేశారు. తనకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరను వదలకుండా చిత్ర పరిశ్రమలో హైపర్ ఆది సత్తా చాటుతున్నాడు. అలాగే జనసేన పార్టీలో హైపర్ ఆది క్రియాశీలకంగా ఉంటున్నాడు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.