https://oktelugu.com/

WhatsApp users: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ ఫీచర్స్ అందుబాటులోకి..

చేతిలో ఉన్న ప్రతీ మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. టెక్స్ట్ మెసేజ్ నుంచి వీడియోల వరకు క్షణాలో పంపించుకునే ఒకే ఒక యాప్ అని కొందరు భావిస్తుంటారు. అందుకే చాలా మంది వాట్సాప్ ను వినియోగించుకునేందుకు లైక్ చేస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 3, 2023 6:58 pm
    Whatsapp-UPI
    Follow us on

    WhatsApp users: వాట్సాప్ వినయోగదారులకు మాతృసంస్థ మెటా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వాట్సాప్ నుంచి ఇప్పటికే యూపీఐ ద్వారా పేమెంట్ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ పేమేంట్ విషయంలో వినియోగదారులు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వినియోగదారులకు అనుగుణంగా ‘హలో UPI’ పేరుతో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పేమేంట్ విషయంలో సులువుకానుందని అంటున్నారు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..

    చేతిలో ఉన్న ప్రతీ మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. టెక్స్ట్ మెసేజ్ నుంచి వీడియోల వరకు క్షణాలో పంపించుకునే ఒకే ఒక యాప్ అని కొందరు భావిస్తుంటారు. అందుకే చాలా మంది వాట్సాప్ ను వినియోగించుకునేందుకు లైక్ చేస్తారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాట్సాప్ సైతం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల ఫొటోలు, వీడియోలు క్వాలిటీ తగ్గకుండా పంపించుకునే సౌకర్యాన్ని కల్పించింది.

    తాజాగా వాట్సాప్ యూపీఐ పేమేంట్ల విషయంతో కొన్ని సౌకర్యాలను కల్పించింది. ఇక నుంచి వాయిస్ కమాండ్ ఆధారిత పేమెంట్స్ విధానం త్వరలోనే తీసుకురానుంది. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్ పీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా బ్యాలెన్స్ ఎక్వయిరీ, లావాదేవాలు, ఫిర్యాదుల పరిష్కారం సహా పలు ఫీచర్లను వినియోగాదారులు ఉపయోగించుకోవచ్చు. దీంతో ఈ పీచర్స్ గురించి తెలిసిన వాళ్లు ఇంప్రెస్ అవుతున్నారు.