Marriage Loan: రుణం.. అనేది నేటి రోజుల్లో సాధారణమైంది. పెట్టుబడి సాధనంగా మారింది. పేద, మధ్య తరగతి ప్రజల సొంత టింటి కలను నెరవేరుస్తుంది. వ్యాపారం ప్రారంభించడానికి, ప్రారంభించిన వ్యాపారం వృద్ధి చెందడానికి అంగా నిలుస్తుంది. కొత్త వాహనం కొనాలనుకునేవారి కల నెరవేరుస్తుంది. ఇక రైతులకు ఐతే ప్రతీ సీజన్‌లో పెట్టుబడి అందిస్తోంది. అయితే.. రుణాలు అందించం ద్వారా కూడా అనేక సంస్థలు వ్యాపారాలు చేస్తున్నాయి. బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు వచ్చే ప్రధాన ఆదాయం రుణాలపైనే. ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసిచూడు అంటారు పెద్దలు. ఎందుకంటే ఇవి రెండూ కష్టరతమైనవని భావన. కానీ, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇవ్వడం ప్రారంభించాక ఇళ్లు కట్టడం ఈజీ అయింది. ఇక ఇప్పుడు పెళ్లికి కూడా రుణాలు ఇస్తామంటున్నాయి బ్యాంకులు. పెళ్లికి అయ్యే ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతోంది. జీవితంలో ఒక్కసారి జరుపుకునే వేడుక అని అమ్మాయిలు, అబ్బాయిలు గ్రాండ్‌గా సెలబ్రేట చేసుకుంటున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడడం లేదు. దీంతో ఖర్చు తడిసి మోపెడడుతోంది. ఈ తరుణంలో పెళ్లి చేసుకునేవారికి కూడా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
మ్యాట్రిమోనీ డాక్ కామ్‌తో అగ్రిమెంట్..
వివాహ బంధాలకు వేదికగా ఉన్న మ్యాట్రిమోనీ డాట్ కామ్ మరో ముందడుగు వేసింది. వెళ్లి వేడుక నిర్వహణకు అవసరమైన రుణం ఇచ్చేందుకు వెడ్డింగ్‌లోన్స్ డాట్ కామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఐడీఎఫ్‌సీ, టాటా క్యాపిటల్, లారెన్స్ అండ్ టూబ్రో ఫైనాన్స్‌తో చేతులు కలిపింది. వివాహ ప్రణాళిక, బడ్జెట్, అమలు ప్రక్రియను సులభతరం చేయడానికి సేవలను విస్తరిస్తున్నట్లు మ్యాట్రిమోనీ డాట్‌కామ్ సీఈవో మురుగవేల్ జానకిరామన్ తెలిపారు.
రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు రుణాలు..
ఇక వెడ్డింగ్ లోన్స్ డాట్ కామ్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థలు పెళ్లికి రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు రుణాలు ఇస్తాయని జానకిరామన్ తెలిపారు. నెలవారీ ఈఎంఐ కాలపరిమితి 30 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ పెళ్లిళ్ల సీజన్ నుంచే దీనిని అందుఆటులోకి తెచ్చామని తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) అంచనాల ప్రకారం.. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య వివాహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 48 లక్షల జంటలు ఒక్కటవుతాయని వెల్లడించింది.