
SBI Customers: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ అందిస్తున్న సర్వీసులలో కిసాన్ క్రెడిట్ కార్డు సర్వీసులు కూడా ఒకటి. ఎవరైతే కిసాన్ క్రెడిట్ కార్డును కలిగి ఉంటారో ఈ కార్డు సహాయంతో సులభంగా మూడు లక్షల రూపాయల రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ కార్డు ఉన్నవాళ్లకు సులువుగా రూ.3 లక్షల రుణం లభిస్తుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులు కిసాన్ క్రెడిట్ కార్డును పొందేలా స్పెషల్ స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ లో భాగంగా రుణాన్ని తీసుకున్న రైతులు 4 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకున్న రైతులు కచ్చితంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సక్రమంగా లోన్ చెల్లిస్తే మాత్రమే తక్కువ వడ్డీ రేటు పడుతుంది. అలా కాకుండా ఉంటే మాత్రం 7 శాతం వడ్డీరేటును చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ను కలిగిన రైతులు సమీపంలోని బ్రాంచ్ కు వెళ్లకుండానే రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్బీఐ యోనో యాప్ సహాయంతో సులభంగా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి కిసాన్ క్రెడిట్ కార్డ్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
యోనో యాప్ లో యోనో అగ్రికల్చర్ అనే ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ కు సంబంధించిన వివరాలను అప్ డేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత అకౌంట్ పై క్లిక్ చేసి కేసీసీ రివ్యూ సెక్షన్ ను ఎంచుకుని కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.