
BSNL Offers: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ అద్భుతమైన ప్లాన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. డీఎస్‌ఎల్, ఎఫ్‌టీటీహెచ్ వినియోగదారులకు ఈ ఆఫర్ల వల్ల ప్రయోజనం చేకూరనుంది. మూడు సంవత్సరాల సర్వీసులకు ఫీజు చెల్లించిన వినియోగదారులు నాలుగు నెలలు ఫ్రీగా ఇంటర్నెట్ పొందవచ్చు.
36 నెలల సర్వీసులకు ఫీజు చెల్లించిన వాళ్లు అదనంగా నాలుగు నెలలు బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. 24 నెలల సర్వీసులకు ఫీజు చెల్లించే వినియోగదారులు మూడు నెలలు ఉచితంగా ఇంటర్నెట్ ను పొందే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఉన్న వినియోగదారులకు ఈ ఆఫర్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. 12 నెలల బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు చెల్లించే కస్టమర్‌లు నెలరోజుల ఫ్రీ సర్వీసులను పొందవచ్చు.
ప్రముఖ టెలీకాం ప్రొవైడర్లలో ఒకటైన బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలను తీసుకోవడం గమనార్హం. బీఎస్‌ఎన్‌ఎల్ టెలీకాం ప్రొవైడర్ సేవలను వినియోగించే కస్టమర్లకు ఈ ప్లాన్ల ద్వారా ప్రయోజనం చేకూరనుంది. బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఈ ప్రమోషనల్ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల కోసం వేర్వేరు ప్లాన్లను అందుబాటులో ఉంచింది.
449 రూపాయలు, 779 రూపాయలు, 999 రూపాయలు, 1499 రూపాయల ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తుండటం గమనార్హం. సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ ను సంప్రదించి ఈ ప్లాన్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.