Maruthi Cars: దేశంలో మారుతి కార్లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుందన్న విషయం చాలా మందికి తెలుసు. ఈ తరుణంలో కంపెనీ నుంచి కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పటికే హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు కారు ప్రియులకు అనుగుణంగా మారుతి కంపెనీ కార్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొత్త ఏడాది సందర్భంగా ఈ కంపెనీ కొన్ని కొత్త కార్లు..మరికొన్ని అప్ గ్రేడ్ కార్లను తీసుకురాబోతుంది. దీంతో మారుతి కారు కొనాలని అనుకునేవారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. అయితే మారుతి నుంచి రిలీజ్ అయ్యే ఆ కొత్త కార్లు ఏవి? అవి ఎలా ఉండబోతున్నాయి? ఆ వివరాల్లోకి వెళితే..
పెట్రోల్, డీజిల్ వెహికల్ స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు చేర్చాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈవీ కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలో కొత్త ఈవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టి ఆకట్టుకున్నాయి. ఈ సెగ్మెంట్ లో మారుతి సైతం తన సత్తా చాటాలని అనుకుంటోంది. దీంతో మారుతి కొత్త ఈవీని మార్కెట్లోకి తీసుకురాబోతుంది. దీనిని జనవరిలో భారత్ ఆటో మొబిలిటీ షో లో ప్రదర్శించే అవకాశం ఉంది. ఇందులో 49 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు.సింగిల్ ఛార్జింగ్ తో 550 కిలోమీటర్ల వరకు వెళ్లే ఈ కారు రూ. 22 లక్షల తో విక్రయించే అవకాశం ఉంది. ఇందులో సేప్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయిన మొదటి 7 సీటర్ కారు గ్రాండ్ విటారా. ఈ కారు ఇప్పటికే చాలా మంది వినియోగదారులను ఆకట్టుకుంది. అయితే నేటి తరం వారికి అనుగుణంగా ఉండేందుకు కొన్ని ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యాన్ని అప్ గ్రేడ్ చేశారు. దీనిని కొత్త ఏడాదిలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే ఏ నెలలో అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ కొత్త ఏడాది లో మాత్రం ఇది మార్కెట్లోకి రానుంది.
హ్యాచ్ బ్యాక్ కార్లను తీసుకురావడంలో మారుతి కి మంచిన వారు లేరని కొందరి అభిప్రాయం. ఇందులో భాగంగా కొత్త ఏడాదిలో మారుతి నుంచి కొత్త బాలెనో మరోసారి మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే బాలెనో మార్కెట్లో ఉంది. అయితే దీనిని ఆధునీకరించి హంగులు చేర్చారు. కొత్త బాలెనోలో టచ్ స్క్రీన్ ను పెద్దదిగా మార్చారు. డ్రైవర్ డిస్ ప్లే, సింగిల్ ప్యాన్ సన్ రూప్, వైర్ లెస్ ఫోన్ చార్జర్, టైర్ రిఫ్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉండనున్నాయి.
ఎస్ యూవీ సెగ్మెంట్ లో మారుతి బ్రెజ్జా ఆకట్టుకుంది. అయితే ఈ కారు కొత్త ఏడాదిలో సరికొత్తగా మార్కెట్లోకి రానుంది. ఇందులోని ఫీచర్లు మార్చనున్నారు. ఇంజిన్ పనితీరులో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అప్ గ్రేడ్ అయిన కారు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఇంకా ప్రకటించలేదు. ఏదీ ఏమైనా కొత్త ఏడాదిలో మారుతి కంపెనీ నుంచి కొత్త కార్లు రాబోతుంది.