https://oktelugu.com/

Horoscope Weekly: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి రాజయోగం.. పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త ఏడాది సందర్భంగా కొన్ని రాశుల ఫలితాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరికి పాత ఏడాదిలో ఉండే బాధలు తొలగిపోవడంతో పాటు కొత్త ఉత్సాహంగా అంటారు

Written By:
  • Srinivas
  • , Updated On : December 30, 2024 / 05:30 PM IST

    Zodiac Signs

    Follow us on

    Horoscope Weekly: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త ఏడాది సందర్భంగా కొన్ని రాశుల ఫలితాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరికి పాత ఏడాదిలో ఉండే బాధలు తొలగిపోవడంతో పాటు కొత్త ఉత్సాహంగా అంటారు. మరి కొందరికి ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మైసమ్మ నుంచి మీనా వరకు ఈ వారంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

    మేష రాశి : మేష రాశి వారికి ఈ వారం ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు ఊహించని విధంగా లాభాలు పొందుతారు. దీనితో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరి కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. బంధువుల నుంచి పెండింగ్ బకాయిలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    వృషభరాశి : వృషభం రాశి వారు ఈ వారం సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పూర్వికుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భాగస్వాములతో వ్యాపార అభివృద్ధిపై చర్చిస్తారు. వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. అధికారుల ప్రశంసలతో పదోన్నతులు కూడా పొందే అవకాశం ఉంది.

    మిథున రాశి: ఈ రాశి వారికి ఈ వారం కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉండనున్నాయి. అనుకోకుండానే ఖర్చులు పెరుగుతాయి. కొందరితో వాగ్వాదం ఉంటుంది. ముఖ్యంగా బంధువుల్లో ఒకరితో గొడవలు ఉంటాయి. విహారయాత్రలు చేసి ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. మొత్తంగా ఈ వారం ఈ రాశి వారికి గందరగోళ పరిస్థితి ఉంటుంది.

    కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈ వారం ఉల్లాసంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. వాహనాలు, భూముల కొనుగోలు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కాస్త ధన వ్యయం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కానీ నిర్లక్ష్యం చేయకుండా సమస్యలను పరిష్కరించుకోవాలి.

    సింహా రాశి : ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యమైన పనులన్నీ వాయిదా పడతాయి. అయితే కొన్ని పనులు కష్టంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు ఎంత ప్రయత్నించినా కొన్ని పరీక్షల్లో తప్పుతూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు లాభాలు స్వల్పంగా పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. రాజకీయ నాయకులు అనుకోకుండా దేశాలకు వెళ్తారు.

    కన్యరాశి : కొన్ని పెండింగ్ పనులు అలాగే ఉండిపోతాయి. అయితే అప్పులు తీరేందుకు మార్గం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతారు. వ్యాపారులకు లాభాలు రావడంతో ఉల్లాసంగా ఉంటారు. వారం మధ్యలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి.

    తుల రాశి : ఈ వారంలో ఈ రాశి వారు అసంతృప్తిగా ఉంటారు. కొన్ని పనులు చాలా నెమ్మదిగా పూర్తవుతాయి. స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగాల్లో చేసేవారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులకు లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత శుభవార్తలు వింటారు. ఆస్తులకు సంబంధించి ఏర్పడిన వివాదాలు సర్దుకుంటాయి.

    వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఆత్మీయులతో విభేదాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక రునానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకోకుండా విహారయాత్రలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేయడానికి సిద్ధం చేసుకుంటారు. వారం మధ్యలో చికాకులు విభేదాలు ఏర్పడతాయి. అయితే స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

    ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈ వారం లాభాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులు కొత్త ఉద్యోగాల్లో చేరుతారు. తీర్థయాత్రలు చేయడం వలన ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు అనుకోకుండా లాభాలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు లాభాలు ఇస్తాయి.

    మకర రాశి : ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విభేదాలు తొలగిపోతాయి. శుభకార్యాలపై చర్చిస్తారు. వ్యాపారులకు లాభాలు ఉండడంతో కొత్త పెట్టుబడులు పెడతారు. విదేశాల్లో ఉండే కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేస్తారు.

    కుంభ రాశి : అనుకోకుండా ప్రయాణాలు ఉండే అవకాశం గతంలో ఉన్న కొన్ని సమస్యలతో ఎక్కువగా బాధపడతారు. వ్యాపారులకు తగినంత లాభాలు రావడంతో ఉల్లాసంగా ఉంటారు. కొత్తగా ఉద్యోగాలు చేరే వారికి అనుకూల వాతావరణం ఉంటుంది అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. కొందరికి మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబంలో చికాకులు ఉంటాయి.

    మీనరాశి : ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు కుటుంబంలో జరిగే శుభకార్యాల గురించి చర్చిస్తారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. రాజకీయాల్లో ఉండే వారికి కొత్త పదవులు వచ్చే అవకాశం. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి.