Fisherman: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మత్స్యకారుల కొరకు స్పెషల్ స్కీమ్ ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.
మత్య్సకారులు చేపల పెంపకం ద్వారానే జీవనాన్ని సాగిస్తున్న సంగతి తెలిసిందే. మత్స్య సంపద అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధమైంది. 20,050 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేయనుండటం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా మత్స్య రంగానికి సంబంధించిన తీవ్రమైన లోపాలను తొలగించడం జరుగుతుంది.
Also Read: రోడ్డుపై దొరికిన డబ్బులను తీసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
ఈ స్కీమ్ సహాయంతో నాణ్యమైన విత్తనాల సేకరణ, మెరుగైన నీటి నిర్వహణ చేస్తారు. ఈ స్కీమ్ వల్ల చేపల పెంపకంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీమ్ వల్ల మత్స్య రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ఈ పరిశ్రమతో సంబంధం ఉన్న రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద ఏకంగా 3 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తోంది.
ఆధార్ కార్డు, చేపల పెంపకం కార్డు, నివాస ధృవీకరణ పత్రం, సంప్రదింపు నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, దరఖాస్తుదారు కుల ధృవీకరణ పత్రం కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. pmmsy.dof.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Also Read: ఈ వ్యక్తులు పెరుగు తింటే విషంతో సమానమట.. శాస్త్రవేత్తల హెచ్చరిక?