Gold, Silver Prices: గత కొన్నిరోజులుగా కొత్తగా బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలు సామాన్య ప్రజలను తెగ టెన్షన్ పెడుతున్నాయి. అయితే గత కొన్నిరోజులుగా భారీస్థాయిలో పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొలిక్కి వచ్చే పరిస్థితులు ఉండటంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చమురు ఉత్పత్తిని పెంచుతూ చేసిన ప్రకటన కూడా బంగారం, వెండి ధరలు తగ్గడానికి ఒక కారణమని చెప్పవచ్చు. దేశంలో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1600 రూపాయలు తగ్గడంతో 48,200 రూపాయలుగా ఉంది. 50,000 మార్కుకు చేరువైన 22 క్యారెట్ల బంగారం ధర భారీ మొత్తంలో తగ్గడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం ధర మరింత ఎక్కువ మొత్తం తగ్గింది.
ఏకంగా 1,750 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,580 రూపాయలుగా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర ఏకంగా 1,800 రూపాయలు తగ్గడంతో పలు రాష్ట్రాల్లో వెండి ధర 69,400 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వెండి ధర తగ్గినా కిలో వెండి ధర 74,100 రూపాయలుగా ఉంది. బంగారం, వెండి కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు.
అయితే రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతాయని ఈ విషయాలను గుర్తుంచుకుని బంగారం, వెండి కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పతనం కావడం గమనార్హం. మదుపరులు కూడా బంగారంలో పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.