Gold, Silver Prices: ఇతర దేశాల ప్రజలతో పోలిస్తే మన దేశ ప్రజలు బంగారం, వెండి కొనుగోళ్లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. నిన్న బంగారం, వెండి ధరలు పెరగగా ఈరోజు మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండటం గమనార్హం. బంగారం, వెండి కొనుగోలు చేసేవాళ్లకు ఇది శుభవార్త అనే చెప్పాలి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం 10 రూపాయలు పెరిగి 51,770 రూపాయలుగా ఉంది.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం నిలకడగానే 47,450 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 72,900 రూపాయలుగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇదే ధర అమలవుతోంది. అయితే దేశీయ మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉంటే అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్ కు 1.11 శాతం తగ్గడంతో ఔన్స్ బంగారం ధర 1921 డాలర్లుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ లో వెండి ధర కూడా తగ్గగా ఔన్స్ కు 1.90 శాతం తగ్గుదలతో 25.13 డాలర్లుగా ఉంది. దేశీయ మార్కెట్ కు అంతర్జాతీయ మార్కెట్ కు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉండటం గమనార్హం. గోల్డ్ రేట్ పై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతుండగా బంగారం ధరలు నిలకడగా ఉండటంతో దేశంలో బంగారం కొనుగోళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయని సమాచారం అందుతోంది.
అయితే జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, ఇతర పన్నులు కలిపితే బంగారం, వెండి కొనుగోలు చేసేవాళ్లు మరింత ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరలలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.