https://oktelugu.com/

TRS MLA Shankar Naik: మందేసి చిందేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

TRS MLA Shankar Naik:హోలీ.. కుల మతాలకు, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా జరుపుకునే పండుగ. విభిన్న రీతులు.. వివిధ సంస్కృత, సంప్రదాయాలు.. పండుగ జరుపుకునే తీరు వేరు అయినా.. పండుగ జరుపుకోవడం మాత్రం ఘనమే. జీవితంలోని కష్టాలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, ఆప్యాయతలు, అనురాగాలకు ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుంటారు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో హోలీ పండుగ కళ తప్పింది. ఈ ఏడాది కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడం, 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2022 1:19 pm
    Follow us on

    TRS MLA Shankar Naik:హోలీ.. కుల మతాలకు, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా జరుపుకునే పండుగ. విభిన్న రీతులు.. వివిధ సంస్కృత, సంప్రదాయాలు.. పండుగ జరుపుకునే తీరు వేరు అయినా.. పండుగ జరుపుకోవడం మాత్రం ఘనమే. జీవితంలోని కష్టాలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, ఆప్యాయతలు, అనురాగాలకు ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుంటారు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో హోలీ పండుగ కళ తప్పింది. ఈ ఏడాది కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడం, 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావడంతో శుక్రవారం హోలీ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, హోదాతో సంబంధం లేకుండా అందరూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

    మందు..! చిందు..! కార్యకర్తల నోట్లో మందు పోసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ || News Telangana Tv

    అందరిలా రంగులు పూసుకుంటే ప్రత్యేకత ఏముంటుంది అనుకున్నారో ఏమో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఈ ఏడాది హోలీ పండుగను సరికొత్తగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా తన ఇంటికి వచ్చిన నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులకు శంకర్‌నాయక్‌ మద్యం పంపిణీ చేపట్టారు. కొంతసేపు నాయకులతో రంగులు చల్లుకున్న ఎమ్మెల్యే తర్వాత తానే స్వయంగా మందుబాటిల్‌ ఎత్తారు.

    Also Read: Telangana BJP: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?

    తన నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులకు మందు స్వయంగా నోట్లో పోశారు. తెరవరా నోరు… పోయరా మందు అంటూ గట్టిగా అరుస్తూ నృత్యం చేస్తూ మద్యం నోట్లో పోశారు. ఈ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం అమ్మకాలనే నమ్ముకుంది అనే విమర్శలు వ్యక్తమవుతుంటే..

    తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మాంసం తిన్న తర్వాత బొక్కలు మెడలో వేసుకున్న చందంగా తన అనుయాయులకు మందు పోస్తూ వివాదాస్పదమయ్యారు. అంతటితో ఆగకుండా.. చాలా మందికి మందు బాటిళ్లు కూడా పంపిణీ చేశారు. హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వం మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించింది.

    ఏటా హోలీ పండుగ సందర్భంగా గొడవలు జరుగుతున్నాయని ఇంటలిజెన్స్‌ అందించిన నివేదికతో ప్రభుత్వం మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించింది. కానీ ఎక్కడా ఆ ఆదేశాలు అమలు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు తెరుచుకున్నాయి. రోజువారీ విక్రయాలకంటే శుక్రవారం ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. టీఆర్‌ఎస ఎమ్మెల్యేనే స్వయంగా మద్యం కొనుగోలు చేసి పంపిణీ చేయడం.. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తన క్యాడర్‌ను మచ్చిక చేసుకునేందుకే శంకర్‌నాయక్‌ ఇలా మద్యం పంపిణీ చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

    Also Read: TDP Twitter Account Hacked: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులతో షాకిచ్చిన హ్యాకర్లు