https://oktelugu.com/

Allu Arjun Pushpa 3 Movie: ‘పుష్ప 3’లో హీరో విజయ్ దేవరకొండ.. మరి బన్నీ ఏమిటి ?

Allu Arjun Pushpa 3 Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో సినిమా వస్తోంది అనగానే.. అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేశారు అంటూ చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి అయితే, ఆ తర్వాత వీళ్ళ సినిమా పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అసలు వీళ్ళ సినిమా ఉందా ? లేదా ? అనే డౌట్ కూడా వచ్చింది. అయితే, ఈ రౌడీ హీరో తన తర్వాత సినిమా.. స్టార్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 16, 2022 / 08:13 AM IST
    Follow us on

    Allu Arjun Pushpa 3 Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో సినిమా వస్తోంది అనగానే.. అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేశారు అంటూ చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి అయితే, ఆ తర్వాత వీళ్ళ సినిమా పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అసలు వీళ్ళ సినిమా ఉందా ? లేదా ? అనే డౌట్ కూడా వచ్చింది. అయితే, ఈ రౌడీ హీరో తన తర్వాత సినిమా.. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ తోనే ఉంటుందని చిన్న హింట్ ఇస్తూ ఆ మధ్య ఒక ట్వీట్ చేశాడు.

    Pushpa

    అయితే, ఆ ట్వీట్ తాజాగా వైరల్ అవుతుంది. సుకుమార్ పుట్టినరోజున విజయ్‌ దేవరకొండ సుక్కుకి విషెస్ తెలుపుతూ.. ఒక మెసేజ్ చేశాడు. “మీతో నేను సినిమా చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను సర్. 2021 ది రైజ్‌, 2022 ది రూల్‌, 2023 ది ర్యాంపేజ్‌” అంటూ విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు. కాగా ఈ సుక్కు – విజయ్ సినిమా పేరు ‘పుష్ప: ది ర్యాంపేజ్‌’ అని టాక్ నడుస్తోంది.

    Also Read: NTR Comments On RRR Movie: అలా ఐతే ‘ఆర్ఆర్ఆర్’ ఒప్పుకునే వాడిని కాదు – ఎన్టీఆర్

    ఇక విజయ్ దేవరకొండ మాత్రం చాలా తెలివిగా తనను తానూ పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ చేసుకోవడంలో పూర్తి సక్సెస్ అయ్యాడు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి తన మార్కెట్ పరిధిని కూడా రెట్టింపు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు ఈ హీరో. అయితే, విజయ్ ది బలుపు కాదు, వాపు అని వాదించే వారు కూడా ఉన్నారు అనుకోండి.

    ఇక ఈ సెన్సేషనల్ హీరో – క్రియేటివ్ డైరెక్టర్ కలయికలో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ తో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పుష్ప 2 ఈ ఏడాది వరకు ఉంటుంది. అలాగే సుకుమార్ స్క్రిప్ట్ రాయడానికి ఎంత లేదన్నా ఆరు నెలల టైం తీసుకుంటాడు.

    Pushpa

    కాబట్టి వీరి సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమాని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు, మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

    Also Read: Highest Bodyguard Salary In Bollywood: ఏ హీరో బాడీగార్డ్ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో తెలుసా ?

    Tags