Mega Family : జనవరి 10..ఈ తేదీని చూస్తే మెగా అభిమానుల గుండెల్లో ఇక నుండి రైళ్లు పరిగిస్తాయని అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ తేదీన విడుదల చేసిన మెగా హీరోల సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచి, అభిమానులకు ఆ సినిమాల పేర్లు చెప్తే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు ఈ తేదీన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ మిగిలిన మెగా హీరోలలో సినిమాలలో ఒకటి మృగరాజు. ఈ చిత్రానికి ముందు కూడా చిరంజీవికి వరుస ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే చూడాలని ఉంది చిత్రం తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ తో కలిసి చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను ఈ చిత్రం కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది. ఫలితంగా మెగా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ గా మిగిలింది ఈ చిత్రం.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ‘అజ్ఞాతవాసి’ అనే చిత్రం కూడా ఇదే రోజున విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. పవన్ కళ్యాణ్ అప్పట్లో ఈ సినిమాతో పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాని అధికారిక ప్రకటన చేసారు. దీంతో పవర్ స్టార్ నుండి వస్తున్న ఆఖరి చిత్రం, అందులోనూ గతం లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ ని అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. అభిమానులు ఈ సినిమా పేరు చెప్తే పూనకాలొచ్చి ఊగిపోయేవారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ సినిమాపై విడుదల రోజే తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ పెదవి విరిచారంటే ఎంత పెద్ద ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా పేరు ని చూస్తేనే ఇప్పుడు ఆయన అభిమానులు భయపడిపోతున్నారు. అలాంటి తేదీన ఇప్పుడు రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు, ఈ తేదీ మనకి కలిసిరాదు అనే వాదనని ఈ చిత్రం కొట్టిపారేయాలి, సెంటిమెంట్ బ్రేక్ అవ్వాలి అని మెగా అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ ఈ పవర్ ఫుల్ డేట్ ఫేట్ ని ఇంత పెద్ద కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాని కూడా కాపాడలేకపోయింది. మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అజ్ఞాతవాసి రేంజ్ ఫ్లాప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మూడు రోజుల్లోనే 150 కోట్ల రూపాయల