https://oktelugu.com/

30 ఏళ్ల తరువాత పెళ్లి చేసుకుంటున్నారా? ఈ బాధలు తప్పవు..

ఆలస్యగా పెళ్లి చేసుకోవడం ద్వారా ఏ పని చేసినా ఉత్సాహంగా ఉండదు. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు వస్తాయి. 30 ఏళ్లు దాటిన తరువాత కొన్ని బాధ్యతలు మీద పడుతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 14, 2024 / 03:51 PM IST

    wedding season

    Follow us on

    జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. జీవితంలో ఒక తోడు కావాలంటే మరో వ్యక్తిని ఆహ్వానించాల్సిందే. ఇద్దరు వ్యక్తులు కలిసి మెలిసి, జీవితాన్ని అర్థం చేసుకొని ముందుగు సాగేవారు కొందరే ఉంటారు. అందుకు కారణాలు అనేకంగా ఉన్నా.. నేటి కాలంలో మాత్రం ఆలస్యంగా పెళ్లి చేసుకోవడమూ ఓ కారణంగా చెబుతున్నారు. కొంత మంది కెరీర్ పై ఫోకస్ పెట్టి పెళ్లి విషయం మరిచిపోతున్నారు. దీంతో 30 ఏళ్లు దాటితే గానీ పెళ్లి పీటలు ఎక్కడం లేదు. అయితే పెళ్లి పీటలు ఆలస్యంగా ఎక్కడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అవేంటంటే?

    సాధారణంగా అబ్బాయి 21, అమ్మాయి 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకోవచ్చు. కొందరు ప్రేమలో పడితే తొందరగానే ఒక్కటవుతున్నారు. మరికొందరు మాత్రం పెళ్లిని పట్టించుకోకపోవడంతో 30 ఏళ్లు వచ్చే వరకు ఆగుతున్నారు. ఇలాంటి వారు సరైన అమ్మాయి కోసం వేచిచూస్తుండగా..కెరీర్ పై దృష్టి పెడుతూ ఆలస్యం చేస్తున్నారు. కెరీర్ కంటే పెళ్లి ముఖ్యం కాదని చాలా మంది అనుకుంటారు. దీంతో పెళ్లి ఆలస్యం కావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    ఆలస్యగా పెళ్లి చేసుకోవడం ద్వారా ఏ పని చేసినా ఉత్సాహంగా ఉండదు. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు వస్తాయి. 30 ఏళ్లు దాటిన తరువాత కొన్ని బాధ్యతలు మీద పడుతాయి. దీంతో జీవిత భాగస్వామిపై దృష్టి పెట్టరు. అలాగే ఈ సమయంలో అహం పెరుగుతుంది. దీంతో ఇగో ప్రాబ్లమ్స్ ఎదురై ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతారు. ఈ తరుణంలో చిన్న విషయానికే గొడవపడిపోతుంటారు. ఫలితంగా సుఖంగా జీవించలేరు.

    30 ఏళ్లు దాటిన తరువాత కొంత మంది మహిళ్లలో సంతానోత్పత్తి తగ్గుతుంది. అయితే పెద్దవాళ్ల నుంచి ప్రెషర్స్ పెరగడంతో ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరు తీవ్ర మనస్థాపంతో అనారోగ్య పాలవుతారు. ఒకవేళ అబ్బాయి తరుపున ఒత్తిడి తీవ్రమైతే భర్తపై ప్రేమ తగ్గి మనస్పర్థలు తగ్గుతాయి. ఆలస్యంగా పెళ్లి చేసుకునేవారు ఉద్యోగంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు.