Vijay Devarakonda: విజయ్ దేవరకొండ వరుస సినిమాలను చేస్తూ దూకుడు మీద ఉన్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఆశించిన విజయాన్ని అందించకపోగా విజయ్ కి నటన పరంగా కూడా చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా ప్లాప్ నుంచి తొందరగా రికవరీ కావాలనే ఉద్దేశ్యంతోనే విజయ్ వరుసగా రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇక అందులో ఒకటి రవికిరణ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాగ, మరొకటి రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్ లో వస్తున్న పిరియాడికల్ డ్రామా సినిమాగా తెలుస్తుంది.
అయితే ఇప్పటికే రాహుల్ డైరెక్షన్ లో టాక్సీవాలా అనే సినిమాలో విజయ్ దేవరకొండ నటించాడు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత రాహుల్ నానిని హీరోగా పెట్టి శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ తో తన లక్కును పరీక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీని మొదట రాహుల్ బాలయ్య బాబుకు వినిపించారట. కానీ బాలయ్య బాబు ఉన్న బిజీ వల్ల ఈ సినిమాని చేయలేకపోయాడు. దానివల్ల రాహుల్ ఈ సినిమాను విజయ్ తో చేయాలనే ఉద్దేశ్యం తో అతని దగ్గరికి వచ్చి కథ నరేషన్ ఇచ్చాడట. దాంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఈ సినిమా ఓకే అయినట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాని భారీ ఎత్తున తెరకెక్కించే ఆలోచనలో విజయ్ గాని రాహుల్ గానీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా అనుకున్నంది అనుకున్నట్టుగా తీయగలిగితే మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారు అనేది…