
Naradishti : మనం రోజు వింటుంటాం నరుడు చూపుకు నాపరాయి అయినా పగులుతుందని చెబుతారు. నరదిష్టి, నరదృష్టి మనిషిపై ఎంతో ప్రభావం చూపుతాయని నమ్ముతుంటారు. ఇందులో భాగంగానే మనం ఎదగలేకపోతున్నామని చాలా మంది బాధపడుతుంటారు. నరదిష్టి నివారణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎదుటి వారి వల్ల తమకు ఏ పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
వ్యాపారస్తులు
వ్యాపారం చేసే వారు తమ స్థలాల్లో ఒక గ్లాసులో నీరు పోసి నిమ్మకాయలు వేసి ఉంచుతారు. దీంతో నరదిష్టి తగలకుండా ఉంటుందని అంటారు. దీని వల్ల నెగెటివ్ ఎనర్జీ పోతుందని భావిస్తారు. పూర్వ కాలంలో మనం ఎటైనా బయటకు వెళ్తే జేబులో నిమ్మకాయ వేసేవారు. పొలిమేరలో ఏ గాలి సోకకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని నమ్మకం. ఇలా నరదిష్టి నివారణకు ఎన్నో మార్గాలు ఉపయోగిస్తారు.
రోడ్డు మీద..
మనం ఎటైనా వెళ్తుంటే రోడ్డు మీద నిమ్మకాయలు కనిపిస్తుంటాయి. వాటితో దిష్టితీసి బజారులో పడేస్తుంటారు. నిమ్మకాయ వల్ల మనకు దిష్టి తగలకుండా ఉంటుందని విశ్వాసం. అలా రోడ్డు మీద వేసిన నిమ్మకాయలను తొక్కితే మనకు అలజడి రేగడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, భయం వేయడం వంటివి జరుగుతాయి. దీంతో మనలో భయం పట్టుకుంటుంది.
బాదంకాయ
మనకు దిష్టి తగలకుండా ఉండటానికి బాదంకాయ కూడా ఉపయోగపడుతుంది. దీన్ని పగలగొట్టి అందులో ఉన్న గింజను తీసుకుని రాగి బిల్లల మధ్యలో ఒకదానిపై ఒకటి పెడితే అది గిర్రున తిరిగితే మనకు నరదిష్టి ఉన్నట్లు. మనమీద ఏడుపు ఉంటే దాన్ని నరదిష్టి అంటారు.
అరటి డొప్పలు
కస్తూరి కాయ తీసుకోవాలి. రెండు అరటి డొప్పలు సిద్ధం చేసుకోవాలి. వీటికి ఆవునెయ్యి బొగ్గులో వేసి వీటిని కలిపి బాగా కాల్చాలి. తరువాత కొన్ని రకాల మూలికలతో తయారు చేసిన ఒక బొట్టు తీసుకుని అందులో మారేడు రసం, దానిమ్మపువ్వు రసం, ఇంకా ఏడు రకాల రసాలు కలిపి ఒక బొట్టుగా పెట్టుకుని బయటకు వెళితే మనకు ఎలాంటి సమస్యలు రావని చెబుతారు.
ఈ బొట్టు నరదిష్టికి..
ఈ బొట్టు నరదిష్టికి చెక్ పెడుతుందని నమ్ముతుంటారు. ఎప్పుడైనా బయటకు వెళ్లేటప్పుడు ఈ బొట్టు ధరించడం వల్ల మనకు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఇది ఒక వజ్ర కవచంలా పనిచేస్తుంది. ఈ బొట్టు పెట్టుకోవడంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని పలువురి వాదన.