Low Salary: జీతం తక్కువగా ఉందని నిరాశపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతం ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఏడాదికి ఒకసారి కంపెనీలు సాలరీస్ పెంచుతూ ఉంటారు. అప్పటికీ ఖర్చులు డబుల్ అవుతున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : June 29, 2024 4:55 pm

Low Salary

Follow us on

Low Salary: ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ అంటే ఎప్పటికైనా నిరాశే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శ్రమ అధికంగా ఉండి.. జీతం తక్కువగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్భణం కారణంగా నిత్యావసర, ఇతర ఖర్చులు పెరుగుతున్నా.. అందుకు తగిన జీతం రావడం లేదు. ఒకవేళ జీతం కోసం పొరాడితే ఉన్న జాబ్ ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వచ్చిన దాంట్లో సర్దుకొని జాబ్ ను కాపాడుకుంటూ వెళ్లాల్సిందేనని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ప్రైవేట్ జాబ్ లో ఉండేవాళ్ల జీతం పెరగాలంటే కొన్ని టిప్స్ పాటించాలని టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ చీఫ్ హ్యుమన్ రీసోర్స్ ఆఫీసర్ కొన్ని టిప్స్ తెలిపాడు. ఆయన చెప్పిన టిప్స్ ఎలా ఉన్నాయంటే?

పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతం ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఏడాదికి ఒకసారి కంపెనీలు సాలరీస్ పెంచుతూ ఉంటారు. అప్పటికీ ఖర్చులు డబుల్ అవుతున్నాయి. ఇలా ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. ఖర్చుల వరకే జీతం సరిపోతుందని కొందరు ప్రైవేట్ ఉద్యోగులు వాపోతున్నారు. అయితే ఐటీ సెక్టార్ జీతాలు భారీగానే ఉంటాయని అనుకోవచ్చు. కానీ కొందరు లగ్జరీ లైఫ్ కు అలవాటు పడితే ఆ జీతం సరిపోదని తెలుపుతున్నారు.

అయితే జీతం పెంచాలంటే కొన్ని టిప్స్ పాటించాలని టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ చీఫ్ హ్యుమన్ రీసోర్స్ ఆఫీసర్ కొన్ని టిప్స్ తెలిపాడు. నైపుణ్యం ఎక్కడుంటే అక్కడ ప్రతిఫలం దక్కుతుందంటున్నారు. అంటే కొన్ని పనుల్లో మీ ప్రతిభ చూపితే జీతం భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఒక సంస్థలో పనిచేసినప్పుడు ఆ సంస్థకు అనుగుణంగా ఉండాలి. చీటికి, మాటికి వివాదాలు సృష్టించుకుంటే ఆ ఉద్యోగిపై సంస్థ అసంతృప్తిగా ఉంటుంది. దీంతో ఏదో ఒక కారణంతో ఉద్యోగాన్ని ఊడగొట్టే ప్రమాదం ఉంది.

ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు తోటి వారితో సంయమనం పాటించాలి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్లల్లో కొందరు బాస్ కు దగ్గరై ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు మీ విషయాలు చెప్పే అవకాశం ఉంది. అందువల్ల వారితో మంచిగా ఉండడం వల్ల మీ వ్యక్తిత్వం గురించి చెప్పడం వల్ల మీపై బాస్ కు సదభిప్రాయం కలగవచ్చు. దీంతో జీతాలు పెంచే విషయంలో కొన్ని మార్కులు ఎక్కువే పడొచ్చు.