Friendship: ఈ ప్రపంచంలో స్నేహ బంధం చాలా ముఖ్యమైనది. కానీ కొందరు స్నేహితుల పరువు తీస్తున్నారు. పైకి ప్రేమగా వెన్న పూసినట్లు మాట్లాడతారు. కానీ మనసులో మాత్రం చాలా పగ పెంచుకుంటారు. నిత్యం మీ మంచి కంటే చెడునే ఎక్కువగా కోరుకుంటారు. మన దగ్గర మంచిగానే మాట్లాడుతారు. ఇతరుల దగ్గరకు వెళ్లి మన గురించి బ్యాడ్‌గా చెబుతుంటారు. ఇలాంటి టాక్సిక్ పీపుల్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడం కంటే ఒంటరిగా ఉండటం మేలు. అయితే కొందరికి నిజమైన ఫ్రెండ్స్ ఎవరో, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో కూడా తెలియదు. దీంతో లైఫ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజుల్లో అందరూ కూడా మాస్క్ వేసుకుని ఉంటారు. దీంతో ఎవరూ ఎలాంటి వారో కూడా కనిపెట్టలేరు. కొందరు ఫేక్ ఫ్రెండ్స్ వల్ల ఇతరుల జీవితం కూడా పోతుంది. లైఫ్‌లో మంచి పొజిషన్‌లో ఉండాలంటే కొందరు వ్యక్తులతో స్నేహం చేయకపోవడమే మంచిది. ఇంతకీ ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కుంగిపోయే వారితో..
కొందరు ప్రతీ విషయానికి కుంగిపోతుంటారు. జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి సహజం. కానీ లైఫ్‌లో విజయం సాధించనప్పుడు సంతోషంగా ఉంటారు. అదే ఓటమి వస్తే కుంగిపోతారు. ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేయకపోవడం మంచిది. ఎందుకంటే వీరిని వాళ్లతో స్నేహం చేయడం వల్ల మీరు కూడా వాటికే అలవాటు పడతారు. కాబట్టి ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండటం మంచిది.
ఎనర్జీ వాంపైర్స్
కొందరు ప్రతీ విషయానికి చాలా చిరాకుగా ఉంటారు. దేనిని కూడా ఎంజాయ్ చేయలేరు. ఏదో జీవితంలో కోల్పోయినట్లు ఉంటారు. ఇలాంటి వాళ్లనే ఎనర్జీ వాంపైర్స్ అంటారు. వీరితో ఉండటం వల్ల మీ లైఫ్‌లో నెగిటివిటీ ఇంకా పెరుగుతుంది. కాబట్టి వీరితో దూరంగా ఉండటం మంచిది.
గొప్పలు కోరుకునే వారు
ఇతరుల వారినే పొగడాలని కొందరు కోరుకుంటారు. అది కూడా కేవలం వారిని మాత్రమే పొగడాలని కోరుకుంటారు. ఇలాంటి వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత గొప్పగా మీరు లైఫ్‌లో ఉంటారు.
ఇతరులను చూసి అసూయపడేవారు
కొందరు ఇతరులను చూసి అసూయపడుతుంటారు. వాళ్లకి అది ఉంది, వీళ్లకి ఇది ఉందని వారిలో బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్లతో ఉంటే మీరు కూడా ఇతరులను చూసి అసూయ పడుతుంటారు. ఇతరులపై ఎప్పుడూ ప్రేమతో ఉండాలి. అంతే కానీ ఇలా ఈర్ష్య, అసూయతో ఉండకూడదు.
నిజాయితీ లేనివారు
స్నేహంలో నిజాయితీ తప్పనిసరి. కొందరు మనతో మంచిగానే ఉంటారు. కానీ వెనుక ఎన్నో మాటలు అంటుంటారు. ఇలాంటి వాళ్లతో స్నేహం చేయకపోవడమే మంచిది. మీ వెనుక ఎన్నో మాటలు అంటుంటారు. వీరితో ఎప్పటికైనా ప్రమాదమే.
విమర్శించేవారు
కొందరు ఇతరులను విమర్శిస్తుంటారు. ప్రతీ విషయంలో కూడా ఏ పని చేసిన విమర్శించేవాళ్లతో అసలు స్నేహం చేయవద్దు. వీరివల్ల మీరు కూడా ప్రతీ ఒక్కరిని విమర్శిస్తుంటారు. అందరినీ నెగిటివ్‌గా చూడటమే మీకు అలవాటు అవుతుంది. ఎవరిని అయిన కూడా పాజిటివ్‌గా చూడటం అలవాటు చేసుకునే వారిని మాత్రమే ఫ్రెండ్స్ చేసుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.