Fridge Tips: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు ఆయన ప్రతాపం చూపిస్తున్నారు.దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఎండలకు భయటకు వెళ్లకపోవడమే మంచిది. వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే భయటకు వెళ్లాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వడదెబ్బ తాకే ప్రమాదం కూడా ఉంది. అందుకే జాగ్రత్త. ఇక మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? అయితే ఓసారి చదివేసేయండి.
వేసవిలో ఫ్రిడ్జ్ వాడకం మరింత ఎక్కువ అవుతుంటుంది. ఐస్ వాటర్, చల్లని నీరు, కూరగాయలు, ఫ్రూట్స్ కోసం అంటూ కచ్చితంగా వేసవికాలంలో ఫ్రిడ్జ్ ను ఎక్కువగా వాడుతుంటారు ప్రజలు. ఇవి పదార్థాలను, వాటర్ ను చల్లబరుస్తాయి. అయితే మీ ఫ్రిడ్జ్ పాడైతే రూ. 3వేల నుంచి 4వేల వరకు ఖర్చు చేయాల్సిందే. మరి మీ ఫ్రిడ్జ్ పాడవకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఇంతకీ అవేంటి అనుకుంటున్నారా? అయితే ఓ సారి లుక్ వేయండి.
ఏవైనా గడ్డకట్టిన మంచు లేదా ఇతర పదార్థాలు ఉంటే వాటిని పదునైన వస్తువులతో తొలగించడానికి ప్రయత్నించకండి. వీటివల్ల ఫ్రీజర్ లో రంద్రాలు పడే అవకాశం ఎక్కువ అవుతుంది. దీని వల్ల గ్యాస్ లీకేజ్ సమస్య వస్తుంది. తద్వారా ఫ్రిజ్ చల్లబడదు. కూలింగ్ కెపాసిటీని కోల్పోతుంది మీ ఫ్రిడ్జ్. ఫ్రిజ్ డోర్ పూర్తిగా ఓపెన్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల లోపల మొత్తం వేడిగాలి నిండుతుంది. దీనివల్ల కూడా త్వరగా కూల్ అవకపోవచ్చు. మీరు ఫ్రిజ్ ను ఆఫ్ చేయడం, ఆన్ చేయడం చేస్తున్నారా?
ఆన్, ఆఫ్ చేస్తుంటే ఫ్రిజ్ కంప్రెసర్ పై భారం పడుతుంది. దీనివల్ల చల్లధనం తగ్గిపోవచ్చు. మాట్లాడుతూ ఫ్రిజ్ సర్దితే మరింత ఎక్కువ సమయం పడుతుంది. అంటే ఎక్కువ సేపు డోర్ ఓపెన్ చేయకూడదు. మూడు రోజులకు ఒకసారి రిఫ్రిజిరేటర్ ను డీ ఫ్రాస్ట్ చేయండి. దీనివల్ల ఫ్రిడ్జ్ చల్లదనాన్ని కోల్పోదు. మరి తెలుసుకున్నారు కదా ఇక మీ ఫ్రిడ్జ్ జాగ్రత్త.